Heroine Bhavana.. హీరోయిన్ ప్రముఖ హీరోయిన్ భావన (Bhavana )!ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఆడియన్స్ హృదయాలలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ అందుకున్నారు. తెలుగు స్టార్ హీరో శ్రీకాంత్ (Srikanth )నటించిన మహాత్మ (Mahatma)సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె, ఈ సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది. కానీ ఆ తర్వాత నటించిన ఏ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇక ఆఫర్లు తగ్గడంతో కన్నడ, మలయాళం ఇండస్ట్రీలకే పరిమితమైన ఈమె.. మలయాళ సినీ ఇండస్ట్రీలో జరిగిన సంఘటన (మలయాళ హీరో దిలీప్ చేతిలో అత్యాచారానికి గురైంది) తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.
18 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే కాంబో రిపీట్..
అలా దాదాపు 18 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె, మళ్లీ ఇప్పుడు ముఖానికి రంగు వేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేసింది. ఎక్కువగా లేడి ఓరియంటెడ్, హార్రర్, థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈమె హార్రర్ మూవీ ది హంట్ (The Hunt) అనే సినిమాలో నటించింది. షాజీ కైలాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ లోకి రావడానికి సిద్ధమయ్యింది. నిజానికి ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ , ఇందులో భావన నటనకు మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు.
సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్ స్టేటస్ లభిస్తుందా..
మలయాళం తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఓటీటీ ప్లాట్ఫారం జీ5 లో ఈనెల ఆఖరి నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2006లో విడుదలైన చింతామణి కోలా కేస్ తరువాత అంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత మళ్లీ భావన డైరెక్టర్ షాజీ కైలాష్ కాంబోలో వచ్చిన సినిమా ఇది. ఇందులో భావన డాక్టర్ కీర్తి పాత్రలో ఫోరెన్సిక్ డాక్టర్ గా నటించింది. ఒక మహిళ హత్య కేసు కు సంబంధించిన ఆధారాలను కనిపెట్టే బాధ్యత ఆమెపై ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేపట్టినప్పటి నుంచి ఆమె జీవితంలో అనుకోని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. ఒక ఆత్మ ఆమెను వెంటాడుతుంది.. కీర్తి సహాయంతో ఆ ఆత్మ తన మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంది..? అసలు ఆ ఆత్మ ఎవరిది..? కీర్తికి ఆత్మతో ఉన్న సంబంధం ఏమిటి..? అనే విషయాలు తెలియాలి అంటే ది హంట్ అనే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం ఒకవైపు భయపడుతూ మరొకవైపు థ్రిల్ కి ఫీల్ చేసే ఈ సినిమా అటు ఓటిటిలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.. మొత్తానికి అయితే భావన అన్ని మరిచిపోయి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి హీరోయిన్గా పలు చిత్రాలలో నటిస్తోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఈమె కేస్ ఆఫ్ కొండన్న, గోవిందా గోవిందా , రైన్ ది రియల్ స్టోరీ వంటి చిత్రాలలో నటిస్తోంది. ఈ చిత్రాలన్నీ కూడా మంచి విజయం సాధిస్తే మళ్ళీ స్టార్ స్టేటస్ ను అందుకుంటుంది అనడంలో సందేహం లేదు.