OTT Movies : ప్రతి వారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాకు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. మరికొన్ని సినిమాలు అక్కడ భారీ ఫ్లాప్ ను అందుకొని ఇక్కడ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. ప్రతివారం థియేటర్లతో పాటుగా , ప్రతి శుక్రవారం ఓటిటి లో కూడా కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి.. ఎప్పటిలాగే మరో వీకెండ్ వచ్చేస్తోంది. సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమవుతున్నాయి.. ఇక ఈ వారం ఎవర్ గ్రీన్ సినిమాలు రిరిలీజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాగే కొత్త సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేయండి..
విక్రమ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘తంగలాన్’, రాజ్ తరుణ్ తిరగబడరా సామీ, తమిళ్ రీమేక్ ‘తలైవేట్టాయామా పాళ్యం’ సినిమాలు రానున్నాయి. వీటితో పాటు సూపర్ హిట్ తెలుగు సీరీస్ ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ , హిందీ సీరీస్ పంచాయత్ కూడా ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఏ ఓటీటీలో విడుదల అవుతుందో చూడాలి..
నెట్ ఫ్లిక్స్..
తంగలాన్ : సెప్టెంబర్ 20
ట్విలైట్ ఆఫ్ ది గాడ్స్(ఇంగ్లీష్ సీరీస్): సెప్టెంబర్ 19
కలినరీ క్లాస్ వార్స్ ( కొరియన్ సీరీస్): సెప్టెంబర్ 17
ద క్వీన్ ఆఫ్ విలన్స్ ( జపనీస్ సీరీస్): సెప్టెంబర్ 20
డిస్నీ హాట్ స్టార్..
అగాథ ఆల్ ఎలాంగ్ (ఇంగ్లీష్ సీరీస్): సెప్టెంబర్ 18
ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ ( తెలుగు సీరీస్): సెప్టెంబర్ 20
ద జడ్జ్ ఫ్రమ్ హాల్( ఇంగ్లీష్ సీరీస్) సెప్టెంబర్ 21
అన్ ప్రిజన్డ్ సీజన్2( ఇంగ్లీష్ సీరీస్): సెప్టెంబరు 16
ఆహా..
మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం: సెప్టెంబర్ 20
తిరగబడరా సామీ: సెప్టెంబర్ 19
హై ఆన్ కాదల్: సెప్టెంబర్ 16
అమెజాన్ ప్రైమ్ వీడియో..
తలైవెట్టియాన్ పాళయం: సెప్టెంబర్ 20
ఏ వెరీ రాయల్ స్కాండల్( ఇంగీష్ సీరీస్): సెప్టెంబర్ 19
జియో సినిమా..
ద పెంగ్విన్ (ఇంగ్లీష్ సీరీస్): సెప్టెంబర్ 20
జో తేరా హై వో మేరా హై ( హిందీ సీరీస్): సెప్టెంబర్ 20
సన్ నెక్స్ట్..
రజినీకాంత్ లాల్ సలాం: సెప్టెంబర్ 20
మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఏకంగా 16 సినిమాలు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. అందులో తంగలాన్, మారుతి నగర్ సుభ్రమణ్యం సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో కి విడుదల కాబోతున్నాయి. అక్కడ పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి. మరి ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి. గత వారం తో పోలిస్తే ఈ వారం ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు తగ్గినట్లు తెలుస్తుంది.