Samantha : యంగ్ హీరోలు సైడ్

టాలీవుడ్ ప్రస్తుతం సంక్రాంతి పోటీలో బిజీగా ఉంది. మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అవ్వగా.. అందులో నాలుగు సినిమాలు ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ ను అందుకున్నాయి. అలాగే ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ను దాటేశాయి. కాగా ప్రస్తుతం టాలీవుడ్ మరో పోటీకి సిద్ధమవుతుంది. అదే శివరాత్రి పోరు. శివరాత్రి బరిలో ఉండటానికి ఇప్పటికే పలు సినిమాలు ముందుకు వచ్చాయి. అందులో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న “సార్” సినిమాతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలు కిరణ్ అబ్బవరం నటిస్తున్న “వినరో భాగ్యము విష్ణు కథ”, విశ్వక్ సేన్ నటిస్తున్న “దాస్ కా దమ్కీ” కూడా ఉన్నాయి.

వీటితో పాటు మరో సినిమా కూడా అనూహ్యంగా బరిలో నిలుస్తోంది. అదే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కీలక పాత్రలో వస్తున్న “శాకుంతలం”. గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను దిల్ రాజ్ సమర్పించగా.. గుణ టీమ్ వర్క్ బ్యానర్ పై నీలిమా గుణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ప్రమోషన్ పనులను నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రారంభించాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా సామ్ నుంచి ఇటీవల వచ్చిన “యశోద” సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు “శాకుంతలం” సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సామ్ క్రేజ్ తో పాటు గుణ శేఖర్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు ప్లస్ గా ఉన్నాయి. దీంతో ఈ “శాకుంతలం” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం దాదాపు ఖాయమే అని సిని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో యంగ్ హీరోలు.. శివరాత్రి పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. విశ్వక్ సేన్ ఇప్పటికే ప్రత్యామ్నాయ డేట్ ను కూడా ఫిక్స్ చేశారని టాక్.

- Advertisement -

అలాగే కిరణ్ అబ్బవరం కూడా శివరాత్రి పోటీ నుంచి తప్పుకోవడానికి మేకర్స్ తో చర్చలు జరుపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా కోలీవుడ్ స్టార్ ధనుష్ మాత్రం తన “సార్” సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే సారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. దీనిపై ధనుష్ వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. దీంతో శివరాత్రి పోటీలో “శాకుంతలం”తో సమంత, “సార్” తో ధనుష్ ఉండే ఛాన్స్ ఉంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు