Pawan kalyan: సినిమాలను రాజకియాల కోసం వాడుకుంటున్న హీరోలు ?

టాలీవుడ్ లో ప్రస్తుతం మరో కొత్త పోకడ తెరపైకి వచ్చింది. సినిమాలలో హీరోగా, ఆర్టిస్ట్ గా చేస్తూ, రాజకీయలలోను అడుగుపెట్టిన నాయకులూ టాలీవుడ్ లో నానాటికి పెరుగుతుండటంతో వాళ్ళు నటించే సినిమాలను కూడా వారి వారి రాజకీయ ప్రయోజనాలు వాడుకోవడం లాంటి కొత్త ట్రెండ్ లేవనెత్తున్నారు.

ఇక విషయానికొస్తే టాలీవుడ్ లో రాబోతున్న ఒక మూడు పెద్ద సినిమాలు వచ్చే ఏడాది రాజకీయాలకు క్యాంపెన్ చేయడానికి రెడీ అవబోతున్నాయి. అవేంటంటే పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్, బాలకృష్ణ అఖండ2, ఏపీ సియం జగన్ బయోపిక్ గా తెరకెక్కనున్న యాత్ర-2.

సాదారణంగా ఒక సినిమా తీసి, అది జనాల్లోకి వెళ్ళడానికి ఆ సినిమా యూనిట్ ఎంతగా కష్టపడతారో అందరికి తెలిసిందే. అలాగే పాలిటిక్స్ లో ఇదే విధంగా ఎలక్షన్స్ కోసం అడ్వేర్టైస్మెంట్స్ చేసి, జనాలను ఆకర్షిస్తారు. అయితే ప్రస్తుతం సినిమాలే రాజకీయాలకు అడ్వేర్టైజ్ మెంట్స్ మారనున్నాయి.

- Advertisement -

అయితే గతంలో ఒకటి రెండు సీన్స్ కు, లేదా డైలాగ్ లకు మాత్రమే పరిమితమైన ఈ పోకడ, ఇప్పుడు ఏకంగా సొంత ప్రయోజనాల కోసం సినిమాలు కూడా తీసే స్థాయికి వెళ్ళింది.

పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయాలపై ఈ సినిమాను బ్రహ్మస్రంగా వాడనున్నట్టు సమాచారం అందుతుండగా, ఇక బాలకృష్ణ అయితే బోయపాటి శ్రీను ను పట్టుబట్టి మరీ ఆయన పొలిటికల్ కెరీర్ కు అనుగుణంగా అఖండ 2 సినిమాని రాయిస్తున్నారు.ఇక గతంలో వై యస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తీసిన మహి వి రాఘవ్ ప్రస్తుతం ఏపీ సియం జగన్ బయోపిక్ గా యాత్ర 2 పేరుతో సినిమా తీయబోతున్నారు. తమిళ్ యాక్టర్ జీవ ఇందులో హీరోగా నటించనున్నారు. తొందర్లోనే షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు సిద్దమవుతుంది. ఇటీవలనే ఈ సినిమా ఎనౌన్స్ చేయగా, ఈ విషయాలన్నీ తెరపైకి వచ్చాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు