Karthikeya 2 : హమ్మయ్య.. లైన్ క్లీయర్

టాలీవుడ్ లో ప్రస్తుతం ఒకటే చర్చ అదే లైగర్. “లైగర్ ఇలా ఎలా అయింది. పూరీ లాంటి అనుభవం ఉన్న దర్శకుడు, మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు ఇలాంటి సినిమా ఎలా చేశాడు. పూరీని ఇంత ప్రభావితం చేసింది ఎవరు” అంటూ సినీ విశ్లేషకులు, సినీ లవర్స్, పూరీ అభిమానులు ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా లైగర్ తో పూరీకి, ఛార్మీకి దెబ్బ కాస్త గట్టిగానే పడింది. ఒకవేళ లైగర్ కు పాజిటివ్ టాక్ వస్తే.. పరిస్థితి మరో విధంగా ఉండేది. తొలి రోజుతో పోలిస్తే నేడు స్క్రీన్ ల సంఖ్య భారీగా పెరిగేది. అలాగే కలెక్షన్లు కూడా రోజు రోజుకు పెరుగుతుండేవి.

కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇది లైగర్ టీంకు కష్టంగా ఉన్నా, మరో సినిమాకు కాస్త అనుకులంగా మారిందని చెప్పొచ్చు. అది ఏ సినిమాకు అంటే.. కార్తికేయ2. ఎలాంటి అంచనాలతో ఈ నెల 13న కార్తికేయ2 విడుదలైంది. ముందుగా కేవలం తెలుగులోనే విడులైన ఈ సినిమా.. క్రమంగా పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. హిందీలో అయితే అనూహ్య స్పందన వచ్చింది. రోజు రోజుకు స్క్రీన్ల సంఖ్య, కలెక్షన్లు భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమాపై లైగర్ ప్రభావం ఉంటుందని అనుకున్నారు. స్క్రీన్లు, కలెక్షన్లు తగ్గుతాయని భావించారు.

కానీ, లైగర్ కు డిజాస్టర్ టాక్ రావడంతో కార్తికేయ2పై ఎలాంటి ప్రభావం చూపడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. దీని ఫలితంగా కార్తికేయ2 కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. కాగా ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ రోజు మేకర్స్ కర్నూల్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు