Kalyan Ram : నిలిచి గెలుస్తాడా ?

టాలీవుడ్ లో స్టార్ హీరోలు, మిడ్ రేంజ్ హీరోలు, చిన్న హీరోలు అంటూ మూడు రకాలుగా ఉంటారు. ఇందులో మిడ్ రేంజ్ హీరోల పరిస్తితి కాస్త కష్టంగా ఉంటుంది. చిన్న సినిమాలను చేయలేరు. పెద్ద సినిమాలు చేయడానికి బడ్జెట్ ఉండదు. కొంత మంది మిడ్ రేంజ్ హీరోలు తమ బ్యాగ్రౌండ్ తో పెద్ద సినిమాలు చేసినా.. పెద్దగా హిట్ అవడం లేదు. మిడ్ రేంజ్ హీరోల్లో చెప్పుకొదగ్గ పేరు కళ్యాణ్ రామ్. ఇండస్ట్రీలో ఓ ముద్ర వేసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చాడు.

అంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా, కళ్యాణ్ రామ్ కు ఇండస్ట్రీని షేక్ చేసే హిట్ సినిమాలు రాలేవు. ఈ మధ్య కాలంలో పటాస్, 118 మంచి హిట్ ఇచ్చాయి. కానీ, ఇండస్ట్రీ మొత్తం తిరిగి చూసేంత మాత్రం కాదు. కళ్యాణ్ రామ్ తమ్ముడు తారక్ మాత్రం వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ పాన్ ఇండియా రేంజ్ హీరోగా నిలబడుతున్నాడు. కానీ, కళ్యాణ్ రామ్ కు అలాంటి స్టేజ్ ఇంకా రాలేదు.

అయితే, కళ్యాణ్ రామ్ కు స్టార్ హీరో హోదా బింబిసార తీసుకువస్తుందని నందమూరి ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, ట్రైలర్ ఇలాంటి బజ్ నే క్రియేట్ చేశాయి. ఈ ఒక్క సినిమాతో మిడ్ రేంజ్ హీరోల లిస్ట్ లో కళ్యాణ్ రామ్, స్టార్ హీరోల లిస్ట్ లోకి వెళ్లడం గ్యారంటీ అని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. కాగా ఈ సినిమా ఆగస్టు 5న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

- Advertisement -

అయితే, బింబిసార ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొంటే కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమే. ఆ సవాళ్లు ఏంటంటే.. ప్రస్తుతం జనాలు థియేటర్ల కు రావడం లేదు. “సినిమా పెద్ద హిట్, ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు, భవిష్యత్తులో కూడా రాదు” అనే టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్ లకు కదలడం లేదు. ఫస్ట్ బింబిసార మొదటి షో నుంచే అలాంటి టాక్ ను సొంతం చేసుకోవాలి. దీంతో పాటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సీతా రామం కూడా ఆగస్టు5నే రిలీజ్ కాబోతుంది.

సీతా రామం భిన్నమైన ప్రేమ కథతో వస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బింబిసారకు సీతా రామం మంచి పోటీ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఈ తరుణంలో సీతా రామంకు వెళ్లే ప్రేక్షకులు బింబిసార వైపు వస్తే, తిరుగుండదు అని చెప్పొచ్చు. వీటిని ఎదుర్కొని త్రిగర్తల అధిపతి బింబిసార నిలిచి గెలుస్తాడా, ఎప్పటి లాగే మిడ్ రేంజ్ హీరోల సినిమాల మిగిలిపోతుందా అని తెలియాలంటే, ఆగస్టు 5 వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు