Boyapati Srinu : బూస్ట్ ఇస్తాడా?

యంగ్ హీరో రామ్ పోతినేనికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రామ్ మార్కెట్ కూడా పెరిగింది. దీని తర్వాత రెడ్ సినిమా రావడం, ప్లాప్ అవడం చక చక జరిగిపోయాయి. కానీ, రామ్ కు ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన క్రేజ్ ను మాత్రం తగ్గించలేకపోయింది రెడ్. దీని తర్వాత రామ్ పోతినేని ఎక్కువ ఆశలు పెట్టుకున్న సినిమా ది వారియర్.

తమిళ దర్శకుడు ఎన్. లింగుసామి ది వారియర్ సినిమాను తెరకెక్కించడంతో అంచనాలు కూడా భారీగానే ఉండేవి. విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించడం, మాస్ యాక్షన్ సినిమాగా రావడంతో ది వారియర్ పక్కా హిట్ అనుకున్నారు. కానీ, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ది వారియర్ ప్లాప్ ను మూటగట్టుకుంది. మొదటి రోజు నుంచే నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో చివరికి కమర్షియల్ గా ది వారియర్ చాలా నష్టపోయింది. దీంతో రామ్ పోతినేని ఇమేజ్ కాస్త డేంజర్ జోన్ లో పడిపోయింది.

రామ్ ఇమేజ్ కాపాడుకోవాలంటే, తక్షణం ఒక భారీ హిట్ సినిమా కావాలి. ఆ సినిమా RAPO20 అవుతుందని రామ్ అనుకుంటున్నాడు. రామ్ తన 20వ సినిమాను మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ పోతినేని డబుల్ రోల్ లో కనిపించడం, పూర్తిగా మాస్ రేంజ్ స్టోరీ కావడంతో రామ్ కు ఈ సినిమా ఊరటనిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బోయపాటి కూడా RAPO20ని అఖండ రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మొత్తంగా RAPO20 రామ్ కు కెరీర్ కు బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు