Tollywood: కృతికి సాధ్యం కానిది శ్రీలీలకి ఎలా సాధ్యమైంది …?

పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది శ్రీలీల. పెళ్ళిసందడి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆ సినిమాలో శ్రీలీల అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తర్వాత ధమాకా సినిమాతో హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం శ్రీలీల లైనప్ లో అరడజను పైగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్న శ్రీలీల మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. అంతే కాకుండా బాలకృష్ణ 108వ సినిమా, రామ్ బోయపాటి కాంబినేషన్లో  వస్తున్న సినిమా, నితిన్, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి సినిమాల్లో కూడా హీరోయిన్ గా అవకాశం పొందిందని సమాచారం అందుతోంది.

ఈ క్రమంలో శ్రీలీల హీరొయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి తొలి సినిమా ఉప్పెన తో బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ తర్వాత సరైన హిట్ లేకపోవటం వల్ల పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతోంది. దీంతో వన్ టైమ్ వండర్ అంటూ కృతి శెట్టిని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. శ్రీలీల లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ చూస్తుంటే త్వరలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది.

అందంలో శ్రీలీలకి ఏమాత్రం తీసిపోని కృతి శెట్టికి ఉప్పెన మినహా తర్వాత ఏ సినిమాలో కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కలేదు. శ్రీలీల కూడా కమర్షియల్ సినిమాల్లో నటించినప్పటికీ ధమాకా సినిమా సాంగ్స్ లో శ్రీలీల డాన్స్ హైలైట్ అవ్వటం వల్ల ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. శ్రీలీలకి ఉన్న క్రేజ్ వల్ల సినిమాల్లోనే కాకుండా తరచూ ఏదో ఒక షాప్ ఓపెనింగ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తోంది. ఏదేమైనా హీరోయిన్లు క్లిక్ అవ్వాలంటే అందం అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసిరావాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు