#WaltairVeerayya: మాస్ పార్టీ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో 154వ సినిమాను ఎన్టీఆర్ కు జై లవకుశ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రంగా వస్తున్న వాల్తేరు వీరయ్య ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కేథరిన్ ట్రెసా ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.

అలాగే మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు. దీంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అలాగే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన టైటిల్ గ్లింప్స్, బాస్ పార్టీ సాంగ్ ఫ్యాన్స్ లో ఫుల్ హైప్ ను పెంచింది. కాగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ రోజు వాల్తేరు వీరయ్య నుంచి అదిరిపోయే అప్డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు ఒక అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న బాలయ్య వీర సింహా రెడ్డి ఇప్పటికే తమ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఈ పోస్టర్ లో మెగాస్టార్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఎట్టకేలకు మెగాస్టార్ ను అభిమానులు ఎలా చూడాలనుకున్నారో బాబీ అలానే చూపించే ప్రయత్నం చేసాడు. జనవరి 13న థియేటర్స్ లో మాస్ పార్టీ మొదలుకానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు