Vyooham Trailer Talk: ఇది RGV వ్యూహం… చూస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమైపోతారో..!

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ఏపీ సీఎం జగన్ రాజకీయ జీవితంలో జరిగిన సంఘటనలఆధారంగా తెరకెక్కిన సినిమా వ్యూహం. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 2024 ఎలక్షన్స్ టార్గెట్ చేసుకొని వైసీపీకి పొలిటికల్ క్యాంపెయిన్ కోసమే తీసిన ఈ సినిమా టీజర్ ఇది వరకే రిలీజ్ అవ్వటంతో సినిమా స్టోరీ గురించి ఒక క్లారిటీ వచ్చింది.

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే టీడీపీని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నాడు వర్మ. ఇక ట్రైలర్లో చూస్తే, 2009 నుండి జగన్ పాదయాత్ర స్టార్ట్ చేసి కాంగ్రెస్ హై కమాండ్ ని ఎదిరించి బయటికొచ్చిన దగ్గర నుండి నెలకొన్న నాటకీయ పరిణామాలు అన్నిటిని సినిమాలో కవర్ చేసినట్లు తెలుస్తోంది ట్రైలర్ చూస్తుంటే.

అప్పటి సంఘటనల నుండి తాజాగా బాబు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి కూడా ట్రైలర్లో ప్రస్తావించటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ని కూడా డైరెక్ట్ గా టార్గెట్ చేసాడు వర్మ. 2019 ఎలక్షన్స్ టైమ్ లో జగన్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన కామన్స్ యథాతదంగా సినిమాలో వాడేసాడు వర్మ.

- Advertisement -

ముందుగా ఊహించినట్టుగానే చంద్రబాబులోని కన్నింగ్ అండ్ ఆపర్చునిస్టిక్ యాంగిల్ ని వ్యూహం సినిమాలో ప్రొజెక్ట్ చేశాడు ఆర్జీవీ. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన టీడీపీ, జనసేన అలయన్స్ మీద కూడా ఈ సినిమా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. మరి, ఈ సినిమా చూసాక టీడీపీ, జనసేన పార్టీల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయా లేదా అన్నది ప్రశ్నగా మారింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు