Dhamki : విశ్వక్ సేన్ కి ఇదేం పోయేకాలం! అలాంటి క్యారెక్టర్ చేయడం అవసరమా ?

యంగ్ హీరో విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాలో ఒక ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతున్నడనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలనే దాస్ కా ధమ్కీ సినిమాతో సూపర్ సక్సెస్ లో ఉన్న విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ దశలో విశ్వక్ సేన్ హీరోగా రెండు సినిమాలుండగా, రిలీజ్ కి మరో సినిమా రెడీగా ఉంది. వీటితోపాటు లేటెస్ట్ గా ఈ యంగ్ హీరో ఇంకో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చడని సమాచారం.

ఫలక్ నామా దాస్ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలనే విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన దాస్ కా ధమ్కీ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించిన విశ్వక్, తన తరువాతి సినిమా కోసం ఏకంగా గే పాత్రలో నటించడానికి సిద్దమయ్యాడట .

ఇక విషయానికొస్తే షైన్ స్క్రీన్ బ్యానర్ పై విశ్వక్ హీరోగా ఒక సినిమా డిస్కషన్స్ లో ఉంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో ఒక కొత్త దర్శకుడిని పరిచయంచేస్తూ, లీలా అనే టైటిల్ తో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుందని సమాచారం. అయితే ఈ సినిమాలో విశ్వక్ గే పాత్రలో నటించబోతున్నాడట. ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా తొందరలోనే వస్తుందని టాక్.

- Advertisement -

అయితే గే పాత్రలో నటించడం తప్పేం కాదు. గతంలో కూడా టాలీవుడ్ లో కొంత మంది హీరోలు వాళ్ళ సినిమాల్లో గే పాత్రలలో నటించారు. కాకపోతే విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరో ఇలాంటి పాత్రలో నటించడం వేరు అని చెప్పొచ్చు. విశ్వక్ సేన్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. సాధారణంగా యంగ్ హీరోలంతా మాస్ ఇమేజ్ కోసం ప్రాకులాడతారు అలాంటిది విశ్వక్ సేన్ కి ఈ రకమైన మాస్ ఇమేజ్ కెరీర్ మొదట్లోనే రావడం అదృష్టం అని అనుకుంటుండగా. విశ్వక్ సేన్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే కెరీర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలు చేసారంటే ఒక అర్థం ఉంది, కానీ ఇలా కెరీర్ పీక్ లో ఉన్న సమయం విశ్వక్ ఇలాంటి రోల్ చేస్తుండన్న వార్త విశ్వక్ ఫ్యాన్స్ ని మరియు ప్రేక్షకులని కలవర పెడుతుంది అందరు ఈ యంగ్ హీరోకి ఇదేం పోయేకాలం అన్నట్టుగా ఫిలిం నగర్ లో మాట్లాడుకుంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు