Vishwak : హాలీవుడ్ రేంజ్..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నుంచి వచ్చిన సినిమాలు ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఉంటాయి. తొలి సినిమా వెళ్లిపోమాకే మినహా తర్వాత వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయనే చెప్పచ్చు. విశ్వక్ ఇటీవల అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసింది. దీని తర్వాత ఈ యంగ్ హీరో వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం విశ్వక్ చేతిలో దాదాపు 5 సినిమాల వరకు ఉన్నాయి. ఇందులో దాస్ కా ధమ్కీ అనే సినిమా కూడా ఒకటి. విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండగా, వన్మయే క్రియేషన్స్, విశ్వక్‌సేన్ సినిమాస్‌పై విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కామెడీ, థ్రిల్లర్ గా రాబోతుంది. దాస్ కా ధమ్కీ జోడీగా నివేతా పేతురాజ్ నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ సారధి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు.

RRR, హరి హర వీర మల్లు లాంటి భారీ సినిమాలకు పనిచేసిన బల్గేరియన్ స్టంట్ డైరెక్టర్లు టోడర్ లాజరోవ్, జుజీ ద్వయం ఈ స్టంట్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ హాలీవుడ్ యాక్షన్ మాస్టర్స్ తో వస్తున్న క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తుంది. కాగా దాస్ కా ధమ్కీ ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు