Vishal : గ్యాంగ్ స్టార్ పాత్రలో..

యాక్షన్ హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అయితే గత కొంతకాలంగా విశాల్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. “అభిమన్యుడు” సినిమా తర్వాత ఇప్పటివరకు ఆయనకు మరో హిట్టు పడలేదు. తాజాగా విశాల్ హీరోగా సరికొత్తగా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న చిత్రం “మార్క్ ఆంటోనీ”. విశాల్ కెరీర్ లో 33వ చిత్రంగా వస్తుంది. విశాల్ కొత్త లుక్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. ఇందులో హీరో ఎవరో సినీ లవర్స్ కూడా గుర్తుపట్టలేనట్టుగా ఉంది. మార్క్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రీతు వర్మ, సునీల్ వర్మ, అభినయ, మహేంద్రన్, నిజగల్ రవి, కింగ్లీ నటిస్తున్నారు. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుండగా, ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ ను చూస్తే మార్క్ ఆంటోని చిత్రం పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ఎస్ జె సూర్య ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

విశాల్ బర్త్ డే సందర్భంగా మార్క్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ పోస్టర్ లో విశాల్ గడ్డంతో ఆగ్రహంతో ఊగిపోతూ ఫైటింగ్ చేస్తున్నాడు. ఈ మూవీలో విశాల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మరి గ్యాంగ్ స్టర్ గా విశాల్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు