Virupaksha: విలన్ ట్విస్ట్ అదిరింది… కానీ అసలు విలన్ హీరోయిన్ కాదు!

యాక్సిడెంట్ జరిగిన తర్వాత సాయి ధరం తేజ్ అసలు సినిమాలు చేస్తాడా అనుకుంటున్న టైంలోనే “విరూపాక్ష” మూవీతో ఇచ్చాడు. హారర్ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ మూవీ సాయి ధరం తేజ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి మళ్లీ ఆయన కెరీర్ గాడిన పడేలా చేసింది. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “విరూపాక్ష” మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ పాత్రను పోషించింది. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు రాబట్టింది.

ఈ మూవీలో చెప్పుకోదగ్గ మెయిన్ ట్విస్ట్ హీరోయిన్ క్లైమాక్స్ లో విలన్ గా మారడం. అయితే నిజానికి కార్తీక్ దండు రాసుకున్న స్టోరీలో అసలు విలన్ హీరోయిన్ కాదట. ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించిన సుకుమార్ “విరూపాక్ష” ఒరిజినల్ స్టోరీలో వేలు పెట్టి మరీ కొన్ని మార్పులు చేశారట. ఆ మార్పుల ప్రకారమే హీరోయిన్ ను విలన్ గా మార్చేశారు. మరి ఇంతకీ అసలు విలన్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…

“విరూపాక్ష” మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 21న విడుదలైన విషయం తెలిసిందే. చేతబడి నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో చివరగా హీరోయిన్ ను విలన్ గా చూపించి ప్రేక్షకులను థ్రిల్ చేశారు. కానీ కార్తీక్ దండు రాసుకున్న అసలు కథ ప్రకారం ఈ సినిమాలో విలన్ పార్వతి అక్క. “విరూపాక్ష” మూవీలో పార్వతి అక్క పాత్రను శ్యామల పోషించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే… రుద్రవరం గ్రామంలో సూర్య తన తల్లితో కలిసి 12 ఏళ్ల తర్వాత అడుగు పెడతాడు.

- Advertisement -

ఆ గ్రామంలో హీరో తల్లి తన భూమిని స్కూల్ కోసం ఇచ్చేయడానికి అక్కడికి వస్తుంది. అదే సమయంలో గ్రామ పెద్ద హరిశ్చంద్రప్రసాద్ కూతురు నందినిని హీరో సూర్య ప్రేమిస్తాడు. ఇక ఆ ఊర్లో జాతర జరుగుతున్న సమయంలో అప్పటికే కనిపించకుండా పోయిన వ్యక్తి ఏదో రోగంతో గుడిలోకి వచ్చి అమ్మవారి ముందే రక్తం కక్కుకుని చచ్చిపోతాడు. దీంతో ఆ ఊరికి అరిష్టమని, అది పోవాలంటే అష్టదిగ్బంధనం చేయాలని చెప్పి ఊర్లో నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా, అలాగే బయట నుంచి ఎవ్వరూ రాకుండా ఎనిమిది పగళ్లు, రాత్రుళ్లు ఊరును దిగ్బంధనం చేస్తారు.

ఈ నేపథ్యంలోనే హీరోయిన్ ఫ్రెండ్ సుధా తన ప్రేమ కోసం అష్టదిగ్బంధన నియమాన్ని దాటి తన లవర్ కుమార్ తో పారిపోవాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో తన లవర్ కుమార్ ట్రైన్ ఆక్సిడెంట్ లో చనిపోతాడు. ఇక వెనక్కి తిరిగి వచ్చే క్రమంలో సుధ కూడా చనిపోతుంది. దీంతో వాళ్ల చావును చూసిన ఫస్ట్ పర్సన్ చనిపోతూ ఉంటారు. ఆ క్రమంలోనే పార్వతి కూడా తన కళ్ళను తానే పొడుచుకుని చనిపోతుంది.

ఇక చివరగా హీరోయిన్ ఇదంతా చేతబడి చేసి ఆ ఊరుని నాశనం చేయడానికి, గతంలో తన తల్లిదండ్రులను చంపేసిన ఆ ఊరి మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేస్తుందని సూర్య తెలుసుకుంటాడు. ఆ తర్వాత సూర్య.. హీరోయిన్ ను కాపాడుకోవాలని చూస్తాడు. కానీ, హీరోయిన్ చనిపోతేనే ఊరు ప్రజలు చనిపోకుండా ఉంటారని, చివరికి ఊరు ప్రజల కోసం నందినిని సూర్య చంపేస్తాడు. అయితే నిజానికి లెక్కల మాస్టారు కథలో వేలు పెట్టడం మంచిదయింది. హీరోయిన్ విలన్ కాకుండా పార్వతి అక్క పాత్ర పోషించిన శ్యామల విలన్ అయి ఉంటే ఈ మూవీ ఇంత పెద్ద హిట్ కాకపోయి ఉండేది. ఇదన్నమాట “విరూపాక్ష” విలన్ వెనక ఉన్న అసలు కథ.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు