Vijay Deverakonda : రౌడీ హీరో పై నెటిజన్లు కౌంటర్లు

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల నటించిన చిత్రం “లైగర్”. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కింది. నటి చార్మీ, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ కలిసి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా నటించారు. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ రోజు ఉదయం 9:30 హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో “లైగర్” తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ తో లైగర్ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. యూట్యూబ్ కూడా షేక్ అవుతుంది. ట్రైలర్ విడుదలైన 11 గంటల్లోనే 10 మిలియన్లకు పైగా వ్యూ వచ్చాయి. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నా గత సినిమా సరిగా ఆడగకపోయానా, నా తాత, తండ్రి మీకు తెలియకపోయినా నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు’ అని అన్నాడు.

ఈ వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసత్వంతో ఎదిగిన హీరోలపై కౌంటర్ ఇచ్చేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా వారసత్వంతోనే ఇండస్ట్రీకి వచ్చాడని కౌంటర్లు వేస్తున్నారు. ఆనంద్ మొదటి సినిమా ప్లాప్ అయినా, ఇంకా అవకాశాలు వస్తున్నాయంటే, దానికి కారణం విజయ్ దేవరకొండనే అని కామెంట్ చేస్తున్నారు. తమ్ముడే వారసత్వంతో సినిమాలు చేస్తున్న క్రమంలో విజయ్ దేవరకొండ ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు