Vijay Deverakonda: “టాప్ గేర్” లో విజయ్ దేవరకొండ

Vijay Deverakonda

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన లైగర్ ఫ్లాప్ తరువాత విజయ్, సమంత తో కలిసి ఖుషి సినిమాలో నటించాడు. అయితే ఖుషి సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి సమంత ఆరోగ్య పరిస్థితుల బాగాలేని కారణంగా ఖుషి సినిమా దాదాపు సంవత్సరం పాటు ఆగింది. దాంతో విజయ్ ఖుషి తరువాత చేయవల్సిన సినిమాలకు బ్రేక్ పడింది. ఇక ఇటీవలనే సమంత కోలుకోవడంతో ఖుషి సినిమా షూటింగ్ వెంటనే పూర్తి చేసి, సెప్టెంబర్ 1న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసారు. .

ఇక ఖుషి సినిమా రిలీజ్ తరువాత నుంచి విజయ్ దేవరకొండ తాను చేస్తున్న సినిమాలలో వేగం పెంచాడు. ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లి గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఖుషి సినిమా రిలీజై సరిగ్గా నెల రోజులు కూడా పూర్తి అవకుండానే అప్పుడే విజయ్ చేస్తున్న నెక్స్ట్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు.

దిల్ రాజు ప్రొడక్షన్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్స్ గా పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలనే షూటింగ్ మొదలైన ఈ సినిమా అప్పుడే 50 శాతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుందట. గతంలో పరుశరాం, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక అదే హిట్ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ మరో సినిమాతో ఈ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫ్యామిలీ స్టార్ పేరుతో రాబోతున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి కి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సంక్రాంతి బరిలో పలు పెద్ద సినిమాలున్నప్పటికీ దిల్ రాజు విజయ్ దేవరకొండ సినిమాను కూడా ఈ రేస్ లో భాగం చేయాలనీ చూస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయడం విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు