Hatya : లైలా ఎలా చనిపోయింది ?

బిచ్చగాడు సినిమాతో తమిళ నటుడు విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దీని తర్వాత విజయ్ పలు సినిమాలు చేశాడు. కానీ బిచ్చగాడు వంటి హిట్ మాత్రం రాలేదు. తాజాగా విజయ్ ఆంటోని ఇంట్రెస్టింగ్ స్టోరీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ తమిళ నటుడు నుండి వస్తున్న తాజా చిత్రం ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం వస్తుంది. బాలాజీ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. తాజా గా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. నేచులర్ స్టార్ నాని ఈ చిత్ర ట్రైలర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అనంతరం ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర యూనిట్ ఈవెంట్ నిర్వహించారు.

”ఫర్ఫెక్ట్ మర్డర్ అనేది ఏదీ ఉండదు. అన్ని మర్డర్స్ లో ఒక ఫ్లా ఉంటుంది” అంటూ ట్రైలర్ ప్రారంభంలో హీరో విజయ్ ఆంటోని చెప్పిన డైలాగ్ సినిమా పై ఆసక్తిని పెంచుతుంది. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తుంది. లైలా అనే నటి హత్య ను హీరో ఛేదించే డిటిక్టివ్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ తెల్లగా మెరిసిన జట్టు, గడ్డంతో ఉన్నాడు. ఇలాంటి లుక్ లో విజయ్ ఇప్పటి వరకు కనిపించలేదు.

”వన్ లివ్ ఎ లైఫ్.. దట్స్ వర్త్ డైయింగ్.. నేను పుట్టాను. బతికాను. కానీ ఎదో సాధించాలని అనుకునే లోపే నన్ను చంపేశారు. ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఎలా చంపారు? మీకు తెలియాలంటే, నేను ఎవరో ముందు తెలుసుకోవాలి” అంటూ నటి లైలా చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. ఈ డైలాగ్ తో సినిమా చూడాలి అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. కాగా ఇప్పటి వరకు ఇలాంటి స్టోరీలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘హత్య’ సినిమా భిన్నంగా ఆసక్తిగా ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు