Vidya Balan: డైరెక్టర్ గదిలోకి పిలిచాడు

మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విద్యాబాలన్ ఎప్పుడు ఒక సంచలనమే. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి దేశవ్యాప్తంగా తనకంటూ అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. డర్టీ పిక్చర్ తో విద్యాబాలన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ ద్వారా విద్యాబాలన్ క్రేజ్ కూడా అమాంతం ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అనేక సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. విద్యాబాలన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

దీనిపై తాజాగా విద్యాబాలన్ కూడా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యాబాలన్ తనకి ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ” దక్షిణాది సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. నేను యాడ్ ఫిలిం కోసం డైరెక్టర్ ని కలవడానికి చెన్నై వెళ్లాం. అక్కడ ఓ కాఫీ షాప్ లో దర్శకుడుతో కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పా. ఆదర్శకుడు నన్ను రూమ్ కి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పాడు. అప్పుడే అతని ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. నేను అప్పుడు తెలివిగా గది లాక్ చేయకుండా తెరిచి ఉంచాను. అందుకే ఆదర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు నిమిషాల తరువాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నేను తెలివి ప్రదర్శించడం వల్లే తప్పించుకోగలిగాను. ఆ సంఘటనని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. ఇదొక్కటే కాదు ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదుర్కొన్నాను. వాటి వల్ల మానసికంగా ఇబ్బందులు పడ్డాను” అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు