Hari Hara Veera Mallu : ఫుల్ స్వింగ్ లో..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. టాలీవుడ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ వైపు రాజ‌కీయాల్లో రాణిస్తూనే.. మ‌రోవైపు సినిమాల‌పై దృష్టి సారిస్తున్నారు. ఇప్ప‌టికే ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు చిత్రంలో నిధి అగ‌ర్వాల్ కీల‌కపాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో న‌టులు అర్జున్ రాంపాల్, న‌ర్గీస్ ఫ‌క్రి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా పిరియాడిక్ సినిమా కావ‌డంతో షూటింగ్ కాస్త‌ ఆల‌స్యంగా అవుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు ప‌వ‌న్ కూడా రాజ‌కీయాల్లో ఉండ‌డంతో సినిమా ఆల‌స్య‌మైంది. ప‌వ‌న్ సినిమాకు డేట్స్ ఇవ్వ‌డంతో చ‌కా చ‌కా ప‌నులు కొన‌సాగుతున్నాయి. 2023, మార్చి 30న హ‌రిహ‌ర‌వీరమ‌ల్లు సినిమాను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది.

తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుకి సంబంధించిన ఓ అప్‌డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. సినిమా త‌రువాత షెడ్యూల్లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ జానీ సినిమా గుర్తుకొస్తుంద‌ని కొంద‌రూ ట్వీట్ చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి మ‌రో పాన్ ఇండియా మూవీ అని అర్థ‌మ‌వుతోంద‌ని కొంద‌రూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోటో ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అవ్వ‌డం విశేషం.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు