Trivikram: పతనం నుంచి విజయం వైపు

క్రేజి కాంబినేషన్ తో భారీ అంచనాల మధ్య వచ్చిన ఒక సినిమా డిజాస్టర్ అయింది,గురూజీ గురూజీ అనుకుంటే గునపం దించాడు అని ఫీల్ అయ్యారు చాలామంది, మాములుగా ఆయనపై చాలామందికి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఆ సినిమా డిజాస్టర్ తో వాళ్లకు ఇంకో అవకాశం ఇచ్చాడు త్రివిక్రమ్.చాలామంది ఆ ప్లాప్ ను ఎంజాయ్ చేశారు, సోషల్ మీడియాలో ట్రోల్స్ వేశారు.

అప్పుడెప్పుడో వచ్చిన ఆత్మకథ సినిమా తర్వాత నిర్మాత రాధాకృష్ణ మళ్ళీ ఒక ప్లాప్ సినిమాను భరించారు అదే అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ తో రెండోసారి దర్శకుడిగా పనిచేసిన ప్రతి దర్శకుడు ఫెయిల్ అయినా, ఒక్క త్రివిక్రమ్ మాత్రం అత్తారింటికి దారేది తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి 100 కోట్ల మార్కెట్ కు దారితీసాడు. కొన్నేళ్లు తరువాత ఆ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుంది అనుకున్న టైం అది,అనిరుధ్ రవిచంద్రన్, మణికంధన్ లాంటి టెక్నీషియన్స్ కూడా తోడవ్వడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి, కట్ చేస్తే సంక్రాంతి రిలీజ్, సినిమా భారీ డిజాస్టర్ టాక్.పవన్ కళ్యాణ్ హిట్,ప్లాప్ కి అతీతం కాబట్టి,ఆయన పెద్దగా ఆలోచించరు, అప్పటికే ఆయన రాజీకీయాల్లో కీలక పాత్రను పోషిస్తున్నారు.

సో అప్పుడున్న ప్రాబ్లెమ్ అంతా త్రివిక్రమ్ కే,ఎన్టీఆర్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చెయ్యాలి,అప్పటికీ ఎన్టీఆర్ ఒక పక్క వరుస హిట్ లతో ముందుకు వెళ్తున్నారు.త్రివిక్రమ్ ఈ డిజాస్టర్ నుంచి బయటకు వచ్చి ఎన్టీఆర్ తో ముందుకు సాగాలి.ముందుగానే అనిరుధ్ మ్యూజిక్ అనుకున్న తరువాత అది మారిపోయింది. అరవింద సమేత అని టైటిల్ అనగానే ఏంట్రా ఇది అనుకున్నారు, ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చూస్తే బోయపాటి పోస్టర్ మీద త్రివిక్రమ్ పేరు వేశారు అనేట్లు ఉంది.

- Advertisement -

కట్ చేస్తే 2018 అక్టోబర్ 11న సినిమా రిలీజ్ అయింది. మొదటి ఆటకే సినిమా బ్లాక్ బస్టర్ అని అర్థమైపోయింది. గురూజీ మొదటి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడురా అనుకున్నారంతా, సంక్రాంతికి పోగొట్టుకున్న విజయాన్ని, విజయదశమికి దక్కించుకున్నాడు త్రివిక్రమ్.

ఈ సినిమాలో త్రివిక్రమ్ రచన, రాయలసీమ మాండలికం అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఓటమి ప్రభావం ఎంతటి గెలుపుకి దారి తీస్తుంది అనేదానికి నిదర్శనమే “అరవిందసమేత వీర రాఘవ” ఒక్కో మాట ఒక్కో తూటాల పేలింది ఈ సినిమాలో

కన్నీళ్లు కళ్ళాపి చల్లిన వీధులు,
ఎండిన మావిడాకులు వేలాడే ఇల్లు,
నిశ్శబ్ధంగా ఏడ్చే ఊళ్లు,
వీళ్ళ రక్తంతో సంతకం చేసిన సీమిది.
ఎండిన రక్తం మీద పువ్వులు పూయాలని నేను,
కాదు కత్తులే మొలుస్తాయని వాడు.
ఇద్దరు బ్రతకాలంటే ముగ్గురిని నరకాల్నా ??
ఇది నేను అడగని యుద్ధం
ఇక్కడ చావు కేక ఒక్కటే శబ్ధం.!
అని పతాకస్థాయిలో రాసాడు ఈ సినిమాలో త్రివిక్రమ్.

విధ్వంసం తర్వాత శాంతిని చూపించే సినిమాగా మలిచిన ఈ సినిమా టైటిల్ లో పావురాన్ని చూపించడం త్రివిక్రమ్ తెలివికి నిదర్శనం.

కేవలం డైలాగ్స్ లోనే ప్రతిభను చూపించడం కాకుండా,

నువ్వైనా వొదలరా అయ్యా,
ఈ రొంపు లో దిగాకు నాయనా.
He decides to let go of his revenge.
వోడు బయటికొచ్చినంక ఎట్టాగో మీ చేతిలో కత్తే గదయ్యా,
He Understands her pain.
ఏంది పాపా యోచన? బొట్టు బెడాతారనా? ఎవురు బెట్టేది ? ఇంటి నిండా ముండ మోసినోల్లే,
Her Words break his heart.
యుద్ధం ఆపాలంటే అవతలి దేశపు మంత్రితో కదా మాట్లాడాలి.
He accepts that he is going in a wrong direction.
Vera Raghava a spokesperson and a listner, That’s the beauty.

అని చూపించాడు కూడా. ఒక్క ప్లాప్ మన కెరియర్ ను డిసైడ్ చెయ్యలేదు, కింద పడిన వెంటనే అంతకంటే వేగంతో పైకి లేవడమే జీవితం అని నిరూపించిన త్రివిక్రమ్ “అరవింద సమేత వీర రాఘవ” సినిమాకి నేటితో నాలుగేళ్లు.

#4YearsForAravindhaSametha 🎬

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు