సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోలు వస్తుంటారు. అందరికీ విజయవకాశాలుండవు. కొంత మంది చాలా సినిమాలు తీసినప్పటికీ ఒక్క సినిమా కూడా హిట్ కాదు. మరికొందరూ సినిమాతోనే హిట్ సాధించి తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటుంటారు. అలాంటి హీరో విశ్వన్ సేన్. తాను నటించిన తొలి సినిమా వెళ్ళిపోమాకే. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆయన నటన మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఇక ఈ చిత్రం ద్వారా ఉత్తమ తొలిచిత్ర నటుడిగా సైమ అవార్డు అందుకున్నారు.
ఇక తరువాత ఈ నగరానికి ఏమైంది వచ్చింది. ఈ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ.. ఫలక్‌నుమా దాస్ చిత్రంతో పెద్ద స్టార్ అయిపోయాడు విశ్వక్ సేన్. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ మూవీ అయినటువంటి ఓ మై కడువలే చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఒరిజినల్ వర్షన్‌ని తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమెక్ చిత్రాన్ని కూడా తెరకెక్కించడం విశేషం.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈచిత్రానికి వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. హీరోయిన్‌గా మిథిలా పల్కర్ నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. గుండెల్లోనా గుండెల్లోనా గూడే కట్టేసి అంటూ సాగే మెలోడీ సాంగ్ విడుదల అయింది. ప్రారంభంలో మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. తరువాత బుజ్జమ్మ, బుజ్జమ్మ అనే రిలిక్ ఆకట్టుకుంటుంది. గుండెల్లోనా అనే లిరిక్ వచ్చినప్పుడు మ్యూజిక్ ఒక్కసారిగా మారుమ్రోగిపోవడం హైలెట్ అనే చెప్పాలి. మొత్తానికి ఈ సాంగ్ చాలా అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నది.