Tollywood: ఎన్టీఆర్ నుంచి అప్పు తీసుకున్న రామ్ చరణ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య స్నేహం ఇప్పటిది కాదు. బయట ప్రపంచానికి వీరిద్దరూ స్టార్ హీరోలు కానీ దానికంటే ముందు వారు మంచి స్నేహితులు. టాలీవుడ్ చిత్ర సినిమాలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ హీరోలు తమ సినిమాలతో నువ్వా..? నేనా..? అన్నట్లుగా పోటీ పడుతూ ఉంటారు. జయాపజయాలను ఎవరిని వరిస్తాయనే విషయాలను పక్కనపడితే ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోల మధ్య మంచి స్నేహం ఉంది.

ఇక రామ్ చరణ్ – ఎన్టీఆర్ మధ్యా స్నేహం ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత బలపడింది. ఈ సినిమాతోనే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు తెలిసిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్టీఆర్ నుండి మీరు మీలో ఏ క్వాలిటీ ఉంటే బాగుంటుందని దేనిని చూస్తే అనిపిస్తుండని యాంకర్ ప్రశ్నించగా.. దానికి రామ్ చరణ్ సమాధానం ఇస్తూ.. ఎన్టీఆర్ లో అంతులేని ఎనర్జీ ఉంది. అది ఎక్కడినుండి వస్తుందో ఎవరికీ అర్థం కాదని అన్నారు. అంత ఎనర్జీ అయితే తనలో లేదని అన్నారు రామ్ చరణ్. అవకాశం వస్తే ఎన్టీఆర్ నుండి ఆ ఎనర్జీని తాను అప్పుగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు