Tollywood hero’s First remuneration: తెలుగు హీరోల ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

మరీ ముఖ్యంగా మిగతా హీరోలతో పోల్చుకుంటే మన తెలుగు స్టార్ హీరోలు వందల కోట్లు పారితోషకం తీసుకుంటూ రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు ఇంత రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్న వీరు ఒకప్పుడు ఎంత పారితోషకం తీసుకున్నారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి గతంలో సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. వారి పారితోషకాలు నెలవారీ జీతాలుగా ఉండేవి.. ఆ తర్వాత ఆ పారితోషకం లక్షలు గా మారింది.. అయితే ఇప్పుడు అది కాస్త కోట్లకు ఎదబాకిందని చెప్పవచ్చు.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ లుగా ఉన్న టాలీవుడ్ హీరోలు తమ మొదటి సినిమాకి ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ ని క్రాస్ చేసి పాన్ వరల్డ్ ఇమేజ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే టాలీవుడే ముందు కనిపిస్తోంది.. ఆ తర్వాతే కోలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా.. అంత డిమాండ్ ఏర్పడింది మన హీరోలకి.. దాంతో సినిమా బడ్జెట్ పెరగడంతో హీరోల రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూ వస్తోంది.. మరి ఇప్పుడు ఆ రేంజ్ లో పారితోషకం అందుకుంటున్న హీరోలు.. తమ మొదటి సినిమా కోసం ఎంత అందుకున్నారో ఇప్పుడు చూద్దాం.

పవన్ కళ్యాణ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.. 1996లో వచ్చిన ఈ సినిమా కోసం ఆయన కేవలం రూ.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఇక ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఒక్కో సినిమా కోసం రూ.80 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నారని సమాచారం.

- Advertisement -

మహేష్ బాబు:
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “రాజకుమారుడు” సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా అంతకుముందు తన తండ్రి అన్నయ్య లతో కలిసి నటించిన ఈయన .. హీరోగా మాత్రం తన మొదటి సినిమా కోసం రూ.10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.. ఇప్పుడు పాన్ వరల్డ్ చిత్రంలో నటిస్తున్నందుకు గానూ రూ .100 కోట్ల పారితోషకం తోపాటు సినిమా లాభాల్లో వాటా కూడా తీసుకోనున్నట్లు సమాచారం.

రామ్ చరణ్:
మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి “చిరుత” సినిమాతో అడుగుపెట్టారు రామ్ చరణ్.. ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న రామ్ చరణ్.. ఈ సినిమా కోసం ఏకంగా రూ.50 లక్షలు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం .. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిని అందుకున్న ఈయన ఒక్కో సినిమాకి రూ .100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్:
నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు..అయితే ఆయన ఇండస్ట్రీలోకి “నిన్ను చూడాలని” సినిమాతో హీరోగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం రూ.5లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నారు.

ప్రభాస్:
ప్రస్తుతం రూ .150 నుంచి రూ.170 కోట్ల వరకు ఒక్కో సినిమాకు పారితోషకం అందుకుంటున్న ప్రభాస్ “ఈశ్వర్” సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.15 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్:
అల్లు ఫ్యామిలీ నుంచీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఈ సినిమా కోసం ఏకంగా రూ.20 లక్షల పారిపోషకం తీసుకున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు