Tollywood: టైర్ 1 లోకి ఎంటరైన టైర్ 2 హీరోలు..!

హీరోల రేంజ్ చెప్పటానికి అప్పట్లో సినిమా ఎన్ని సెంటర్లలో ఎన్ని రోజులు ఆడింది అన్న అంశాన్ని కొలమానంగా తీసుకునేవారు. కానీ, మారుతున్న జెనరేషన్ తో పాటు థియేటర్ కు టీవీ, స్మార్ట్ ఫోన్ లాంటి ఆల్టర్నేటివ్స్ వచ్చిన కారణంగా థియేటర్లలో సినిమా ఆడే సమయం కూడా తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ఎన్ని రోజులు ఆడింది అన్నది కాకుండా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది అన్న అంశం హీరోల రేంజ్ డిసైడ్ చేయటం మొదలైంది. ప్రస్తుతం 100కోట్ల మార్క్ హీరోల రేంజ్ డిసైడ్ చేసే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ లో ఒకటి. టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదగటం మొదలైన నాటి నుండి  టైర్ 2లో ఉన్న హీరోస్ కూడా సునాయాసంగా 100కోట్ల క్లబ్ లో చేరుతున్నారు.

ఇటీవల నాచురల్ స్టార్ నాని దసరా సినిమాతో 100కోట్ల క్లబ్ లో చేరగా, కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ 100కోట్ల మార్క్ ను అందుకోగలిగాడు. ఇదిలా ఉంటే, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన తోనే ఈ 100కోట్ల క్లబ్ లో చేరి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. గీత గోవిందం సినిమాతో 100కోట్ల క్లబ్ లో చేరిన టైర్ 2హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ఫిదా సినిమాతో వరుణ్ తేజ్, ఇస్మార్ట్ శంకర్ తో రామ్ పోతినేని 100కోట్ల క్లబ్ లో చేరిన టైర్ 2హీరోల లిస్ట్ లో ఉన్నారు.

అయితే, ఇంకా శర్వానంద్, నాగచైతన్య, గోపీచంద్, నితిన్ వంటి వారు 100కోట్ల క్లబ్ కోసం ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఏర్పడ్డ ఇప్పటి పరిస్థితుల్లో అయినా ఈ యంగ్ హీరోలు 100కోట్ల మైల్ స్టోన్ చేరుకుంటారా లేదా అన్నది వారి తదుపరి సినిమాల రిజల్ట్ మీద ఆధార పడి ఉంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు