2023 Tollywood : కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు వీళ్ళే

2023 Tollywood : తెలుగు సినిమా పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టిని టాలీవుడ్ ఆకట్టుకుంటుంది. ఇక టాలీవుడ్ లో నటించడానికి ఎంతోమంది కొత్త నటీనటులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2023 లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లు ఎవరెవరు? అందులో హిట్ అందుకున్నది ఎవరు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాక్షి వైద్య
అక్కినేని అఖిల్ హీరోగా చేసిన “ఏజెంట్” మూవీతో సాక్షి వైద్య పరిచయమైంది. ఈ మూవీ అట్టర్ ప్లాప్. తరువాత ఆమె “గాంధీవదారి అర్జున” అనే సినిమాలో వరుణ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఈ రెండు సినిమాలు కూడా ఆమెను తీవ్రంగా నిరాశపరిచాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” వంటి ప్రాజెక్టులో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

యుక్తి తరేజ
నాగశౌర్య హీరోగా నటించిన “రంగబలి” మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది యుక్తి తరేజ. కానీ ఈ మూవీ డిజాస్టర్ గా మిగలడంతో ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి.

- Advertisement -

సార్యా లక్ష్మణ్
సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహించిన హిట్ మూవీ “మేం ఫేమస్” సినిమాతో సార్యా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఆమె మొదటి సినిమా హిట్ అయినప్పటికీ టాలీవుడ్లో మంచి అవకాశాలను అందుకోలేకపోయింది.

నుపూర్ సనన్
“టైగర్ నాగేశ్వరరావు” సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది నుపూర్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి అయిన నుపూర్ ఫస్ట్ మూవీ “టైగర్ నాగేశ్వరరావు” ఇచ్చిన ఫలితం ఆమెను నిరాశపరిచింది. ఇక ఆ తర్వాత “కన్నప్ప” మూవీ నుండి కూడా ఈ బ్యూటీ బయటకు వెళ్లిపోయింది.

అషికా రంగనాథ్
ఈ కన్నడ బ్యూటీ నందమూరి కళ్యాణ్ రామ్ సరసన “అమిగోస్” సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. కానీ ఆ మూవీ అనూహ్యంగా పరాజయం పాలైంది. కానీ అషికా నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. మొదటి మూవీతో హిట్ రుచి చూడనప్పటికీ టాలీవుడ్ కింగ్ నాగార్జునతో “నా సామి రంగ” అనే మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది ఈ అమ్మడికి. ఈ మూవీ రిలీజ్ అయ్యాక అషికా ఫ్యూచర్ ఏంటి అనే విషయం తెలుస్తుంది.

రెబా మోనికా జాన్
మలయాళం, తమిళ చిత్ర సినిమాల్లో పాపులర్ ఫేస్ అయిన రెబా మోనికా జాన్ శ్రీ విష్ణుతో “సామజవరగమన” అనే మూవీ చేసింది. అయితే అంతకంటే ముందే “బూ” అనే తెలుగు, తమిళ ద్విభాష చిత్రంలో నటించింది ఈ అమ్మడు. మొత్తానికి ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత అవకాశాలను అందుకోలేకపోయింది.

గీతిక తివారి
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో, దగ్గుబాటి అభిరామ్ చేసిన ఫస్ట్ మూవీ “అహింస”. ఈ మూవీతోనే గీతిక తివారి హీరోయిన్ గా పరిచయం అయింది. కానీ ఆ మూవీ హింసను ప్రేక్షకులు తట్టుకోలేక పోవడంతో ఈ హీరోయిన్ కూడా పత్తా లేకుండా పోయింది.

అవంతిక దాసాని
బెల్లంకొండ గణేష్ తో కలిసి “నేను స్టూడెంట్ సర్” సినిమాతో అరంగ్రేటం చేసింది అవంతిక. కానీ ఈ బ్యూటీ అసలు ఆ సినిమా చేసింది అన్న విషయం కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. ఇలా ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్లు అందరూ డిజాస్టర్ రుచి చూసి, సైలెంట్ గా సైడ్ అయిపోయారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు