SKN: బేబీ నిర్మాతను ఇందుకు మెచ్చుకోవాల్సిందే

“ఎస్ కె ఎన్”.. ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రాస్తూ కెరియర్ మొదలుపెట్టిన ఎస్ కే ఎన్ ఈ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టే సినిమాకు నిర్మాతగా మారాడు. “ఎస్ కె ఎన్” కి పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత సపోర్ట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే “ఎస్ కె ఎన్” కి మెగా ఫ్యామిలీ అన్న, అల్లు ఫ్యామిలీ అన్న ఎనలేని గౌరవం. కొన్ని ఫంక్షన్స్ లో “ఎస్ కె ఎన్” స్పీచ్ వింటే అదంతా ఈజీగా అర్థమవుతుంది.

నిర్మాతగా చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఈరోజు ఒక స్థాయికి వచ్చాడు. “ఎస్ కె ఎన్” ఇప్పటివరకు చాలా సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు.
అయితే వీటన్నిటిలో ఒక ప్రత్యేకత ఉంది. తన ఫ్రెండ్ మారుతి దర్శకత్వం వహించిన ఈ రోజుల్లో సినిమా నుండి ఇప్పటివరకు “ఎస్ కె ఎన్” నిర్మించిన ప్రతి సినిమాలో తెలుగు అమ్మాయిలని మాత్రమే హీరోయిన్ గా పెట్టాడు.

తెలుగు వాళ్లకి ఛాన్సులు దొరకట్లేదు అనుకున్న తరుణంలో “ఎస్ కె ఎన్” చేసిన ఈ ప్రయత్నం హర్షించదగ్గది అని చెప్పొచ్చు. ఇప్పటివరకు “ఎస్ కె ఎన్” చేసిన సినిమాలు ఈ రోజుల్లో, బస్ స్టాప్, రొమాన్స్ టాక్సీవాలా, బేబీ ఇప్పుడు రీసెంట్ గా చేస్తున్న ఒక సినిమాలో కూడా తెలుగు హీరోహిన్ నే తీసుకున్నారు.

- Advertisement -

ఈ రోజుల్లో – రేష్మ
బస్ స్టాప్ – ఆనంది
రొమాన్స్ – మానస హిమవర్ష
టాక్సీవాలా- ప్రియాంక జవాల్కర్
బేబీ – వైష్ణవి చైతన్య

వీళ్ళందరూ తెలుగువాళ్లే, తెలుగు వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అనుకున్న తరుణంలో కష్టపడుతున్న తెలుగు వాళ్ళని గుర్తించి మరి తను నిర్మాతగా చేసే సినిమాల్లో అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు