Adipurush: ఆ హీరోయిన్ని అవన్నీ ఆపేయమంటున్న ఆడియన్స్?

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఆదిపురుష్ జూన్ 16న విడుదలకు సిద్ధం అవుతుంది. మే9 న విడుదలైన ఆదిపురుష్ యొక్క అఫిషియల్ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను భారీ స్థాయిలో పెంచేసింది. ట్రైలర్ కి ముందు ఆదిపురుష్ కి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా, ఏ స్టిల్స్ వదిలినా పలు విధాలుగా ట్రోలింగ్ కు గురయ్యేవి. రామాయణ ఇతిహాసాన్ని చెడగొట్టేలా సినిమా తీసారని టీజర్ చుసిన నెటిజన్స్ డైరెక్టర్ ఓం రౌత్ పైన ఫైర్ అయ్యారు. అయితే వాళ్లందరికీ ట్రైలర్ విడుదలతో దర్శకుడు సమాధానం చెప్పాడు. తాజాగా ఈ మూవీ కి మరో చిక్కు వచ్చి పడింది.

విషయమేంటంటే ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటించిన సంగతి తెలిసిందే. అయితే కృతి సనన్ మీద నెటిజన్స్ కొంతమంది ఫైర్ అవుతున్నారు. కారణమేంటంటే రీసెంట్ గా కృతి సనన్ చేసిన ఫోటోషూట్ లు, ఇకపై చేసే ఫోటోషూట్ లు కొంతకాలం వాయిదా వేస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే ఆదిపురుష్ లో కృతి సనన్ చేసిన సీత పాత్ర భారతదేశంలో అత్యంత పవిత్రంగా భావించే వ్యక్తుల్లో ఒకరు. ప్రజలు దైవంగా భావించే పాత్రలో కృతి సనన్ నటించింది. అలాంటి పాత్రలో కృతి నటించినప్పుడు తనని కూడా చాలామంది ప్రేక్షకులు కూడా ఆమెను ఇష్టంగా భావిస్తారు. కానీ సీత పాత్ర వేస్తూనే ఇన్స్టా గ్రామ్ లో గ్లామర్ షోల ఫోటో షూట్ లు చేసినందుకు కృతిపై నెటిజన్స్ కోప్పడుతున్నారు. కనీసం ఆదిపురుష్ విడుదలై థియేటర్లలోంచి వెళ్లిపోయేంత వరకైనా కృతి సనన్ గ్లామర్ షో లకు దూరంగా ఉంటే మంచిదని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్స్, ఇంకా అభిమానులు సినిమాను సినిమాలనే చూడాలి, షూటింగ్ తర్వాత ఎలా ఉండాలో అది వారి వ్యక్తిగత నిర్ణయం అని అంటూ కృతిని సపోర్ట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు