Tollywood: జర్నలిస్టులు గా నటించిన తెలుగు హీరోలు..!

టాలీవుడ్ లో ఈ మధ్య సోషలిజం మీద, సోసైటీ లో ఉన్న సెన్సిటివ్ కుల, మత, రాజకీయ అంశాలతో సినిమాలు బాగానే వస్తున్నాయి. కానీ ఈ సినిమాల్లో ఎక్కువ మంది హీరోలు వీటిని ప్రతిఘటించే పాత్రల్లో, అంటే ఎక్కువగా ఐఏఎస్, ఐపీఎస్ లేదా, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లోనే నటించడం జరిగింది. కానీ వీటితో సమానమైన స్కోప్ ఉండే పాత్ర ఒక జర్నలిస్ట్ ది. నేటి సమాజంలో ఈ పాత్ర కూడా ఎంతో కీలకం.

ప్రజల తరపున రాజకీయ నాయకుల్ని ప్రశ్నించడానికి, జనాలకి నిజాలని చూపించేవాడే జర్నలిస్ట్. అలా జర్నలిజం, ఇంకా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ లో జర్నలిస్ట్ లుగా నటించిన హీరోలపై ఓ లుక్కేద్దాం..

జర్నలిస్టులుగా చేసిన హీరోలు:

- Advertisement -

01) వెంకటేష్- గణేష్(1998)

Venkatesh Ganesh Movie

విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా 1998 లో పొలిటికల్ జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ గణేష్ గా ఓ జర్నలిస్ట్ పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఇప్పటివరకు జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో దీన్ని తలదన్నే సినిమా రాలేదని చెప్పాలి.

02) పవన్ కళ్యాణ్ – కెమెరామెన్ గంగతో రాంబాబు

Cameraman bhabhi Gangatho Rambabu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు లో ఆయన ఒక జర్నలిస్ట్ గా నటించడం జరిగింది. ఈ సినిమాను అప్పటి తెలుగురాష్ట్రాల పొలిటికల్ అంశాలను బేస్ చేసుకుని తీయగా, సినిమాని రిలీజ్ చేయకుండా అడ్డుకోవాలని అప్పటి పొలిటీషియన్స్ ఎంతో ట్రై చేసారు. ఇక సినిమాలో 12 సీన్లు కట్ చేసిన అనంతరం రిలీజ్ అయింది.

03) శ్రీహరి- పరశురామ్

రియల్ స్టార్ శ్రీహరి హీరోగా నటించిన పరశురామ్ సినిమాలో ఒక జర్నలిస్ట్ గా నటించడం జరిగింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

srihari parasuram movie

04) బాలకృష్ణ – శ్రీమన్నారాయణ

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన శ్రీమన్నారాయణ సినిమాలో ఒక జర్నలిస్ట్ గా నటించాడు.

balakrishna srimannarayana movie

05) జీవా- రంగం

కోలీవుడ్ నటుడు జీవా రంగం సినిమాలో జర్నలిస్ట్ గా నటించడం జరిగింది. 2011 లో వచ్చిన ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది.

jeeva rangam movie

06) కళ్యాణ్ రామ్- ఇజం

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ ఓ జర్నలిస్ట్.

kalyan ram ism movie

07) నిఖిల్ – అర్జున్ సురవరం

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన అర్జున్ సురవరం మీడియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా, నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించాడు.

arjun suravaram movie

08) నాని – శ్యామ్ సింగరాయ్

నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ లో ఫ్లాష్ బ్యాక్ పాత్రలో వచ్చే పాత్ర లో ఒక జర్నలిస్ట్ గా నటించాడు. ఈ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది.

nani shyam singh roy movie

09) నవదీప్ – న్యూసెన్స్

నవదీప్ హీరోగా నటించిన న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ లో నవదీప్ ఒక జర్నలిస్ట్ గా నటించగా, మీడియా లో అమ్ముడు పోయే జర్నలిస్ట్ ల గురించి, రాజకీయాల వల్ల నలిగిపోయే జర్నలిస్టుల జీవితాలని కళ్ళకి కట్టినట్టు చూపించారు.

nani shyam singh roy movie

10) నాగ చైతన్య- దూత

నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఈ దూత. ఈ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య జర్నలిస్ట్ గా ఓ మీడియా ఓనర్ గా నటించగా, డిసెంబర్ 1న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.

naga chaitanya dhootha movie

11) తారకరత్న – తారక్

tarakaratna tarak movie

దివంగత తారక రత్న హీరోగా నటించిన తారక్ అనే సినిమా లో జర్నలిస్ట్ పాత్రలో తారక రత్న మెరిశాడు. కానీ ఈ సినిమా ఆడలేదు.

వీళ్ళే గాక కృష్ణం వందే జగద్గురుం లో నయనతార జర్నలిస్ట్ గా నటించింది. ఇలా చాలా మంది హీరోలు జర్నలిస్ట్ లుగా సినిమాల్లో నటించారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు