Allu Arjun : సూపర్ మాసీవ్ కెరీర్ ప్లానింగ్… ‘యానిమల్’ను కూడా లైన్లో పెట్టేసిన బన్నీ !!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాసివ్ కెరీర్ ప్లానింగ్ చూస్తే ఎవరికైనా దిమ్మతిరిగి పోవాల్సిందే. “పుష్ప’ మూవీ హిట్ అయిన తర్వాత పాన్ ఇండియా హీరోగా సూపర్ సాలిడ్ క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్ తన కెరీర్ ను తన మార్కెట్ కు ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నాడు. తన పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మిగతా హీరోలు జెలసి ఫీలయ్యాలా చేస్తున్నాడు బన్నీ. 2026 వరకు బన్నీ కాల్షీట్లు ఫుల్ అయిపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు అనే విషయం అధికారికంగా బయటకు వచ్చింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప2” చిత్రీకరణ దశలో ఉంది. 2024 వేసవిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. “పుష్ప 2” తర్వాత అల్లు అర్జున్ వెంటనే త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశం ఉంది. 2024 చివర్లో త్రివిక్రమ్ తో బన్నీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగా క్రేజీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుంది. వీరిద్దరి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత బన్నీ డైరెక్టర్ అట్లీతో ఓ మూవీ చేసే అవకాశం ఉంది. ఇలా సౌత్ లోనే స్టార్ డైరెక్టర్స్ అందరికీ వరుసగా కమిట్మెంట్ లు ఇస్తూ బన్నీ తన కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. భవిష్యత్ పట్ల ఆయనకు ఉన్న విజన్, కెరీర్ ప్లానింగ్ ను చూసి అల్లు ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఇక ఆయన కోసం లైన్ లో ఉన్న డైరెక్టర్స్ అందరూ మంచి ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్స్ కావడంతో మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్.

ఇక సందీప్ రెడ్డి వంగా విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న “యానిమల్” మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 1న “యానిమల్” మూవీ రిలీజ్ కానుంది. రష్మిక మందన్న, రణబీర్ కపూర్ జంటగా నటించిన ఈ మూవీ ప్రమోషన్ లోనే ప్రస్తుతం టీం మొత్తం బిజీగా ఉంది. అయితే సందీప్ రెడ్డి ఇప్పటికే అల్లు అర్జున్ కి కథ చెప్పాడని టాక్ నడుస్తోంది. కానీ తాజా సమాచారం మేరకు బన్నీతో ఓ ప్రాజెక్ట్ లాక్ చేసామని, అయితే కథను మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్వయంగా చెప్పుకొచ్చాడు. “యానిమల్” తర్వాత సందీప్, ప్రభాస్ హీరోగా “స్పిరిట్” అనే మూవీ చేయమన్నాడు. ఆ తర్వాతే సందీప్ – అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు