Extra- Ordinary Man : వరుణ్-లావణ్య పెళ్ళిలో నితిన్… ఆ సీక్రెట్ ఇదా?

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల వివాహం జరిగి అప్పుడే నెల కావస్తోంది . అయినా వీళ్ళ గురించిన ఏదో ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ బయటకు వస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా జరిగిన వరుణ్ – లావణ్య పెళ్లికి టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీ కాకుండా హాజరైన ఒకే ఒక హీరో నితిన్. ఆయన ఏకంగా తన భార్య శాలినితో కలిసి వరుణ్ పెళ్లికి హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. దీంతో ఆ టైంలో నితిన్ మాత్రమే ఎందుకు ఈ పెళ్లికి హాజరయ్యాడు అనే క్వశ్చన్ అందరి మదిలో మెదిలింది.

నిజానికి వరుణ్, లావణ్య పెళ్లికి మెగా ఫ్యామిలీకి అతి సన్నిహితులైన వారికి మాత్రమే ఆహ్వానం అందింది. మరి అలాంటప్పుడు నితిన్ ఆ పెళ్లికి ఎందుకు వెళ్ళాడు అనే విషయాన్ని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం నితిన్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” అనే మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యాడు. ఈ క్రమంలోనే వరుణ్, లావణ్య పెళ్లికి తాను మాత్రమే ఎందుకు వెళ్ళాడు అనే విషయాన్ని వెల్లడించాడు. నితిన్ మాట్లాడుతూ గత ఆరేడేళ్లుగా తాను వరుణ్ తేజ్ మంచి స్నేహితులమని, ఎక్కడున్నా సరే డే బై డే తప్పకుండా ఫోన్లో మాట్లాడుకుంటామని వెల్లడించాడు. అంతేకాకుండా అనేక రకాల అంశాలను చర్చిస్తామని కూడా వెల్లడించాడు. వరుణ్ తేజ్ తో తనకున్న క్లోజ్ ఫ్రెండ్ షిప్ కారణంగానే ఈ హీరో పెళ్లికి హాజరయ్యారట.

ఇక నితిన్ విషయాన్నికొస్తే ఆయన గత చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో వక్కంతం వంశీ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే మూవీ తో హిట్ అందుకునే ప్రయత్నంలో ఉన్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ డిసెంబర్ 8న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రమోషన్స్ ను షురూ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. కానీ సినిమాపై ఇంకా కావాల్సినంత హైప్ క్రియేట్ కాలేదు. బజ్ క్రియేట్ కావాలంటే మేకర్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఏదో ఒక ఈవెంట్ ను సాలిడ్ గా ప్లాన్ చేయాలి. మరి ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు