Ahimsa : తేజ మార్క్ వైలెన్స్..

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు అంటే తెలియని వారు ఉండరు. ఆయన కొడుకు దగ్గుబాటి రానా కూడా టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. చాలా మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ తేజ కు ఈ బాధ్యతలను సురేష్ బాబు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ కు అహింస అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు.

తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుండి ఆసక్తికరమైన గ్లింప్స్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్ వీడియోలో హీరో అభిరామ్ కు కొంత మంది ముసుగు వేసి అడవికి తీసుకువస్తున్నారు. అయితే హీరో తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో, మళ్లీ వాళ్ల చేతిలో గాయపడుతాడు.

ఈ గ్లింప్స్ తో సినిమాలో వైలెన్స్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే తేజ తన మార్క్ ఫైట్ సీన్లు, వైలెన్స్ ఈ అహింస సినిమాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గ్లింప్స్ లో ఆర్పీ పట్నాయక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు