Tamannaah: ఆ పోరు భరించలేక పోతున్నా

గ్లామర్ టాలెంటెడ్ హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్న కూడా ఒకరిని చెప్పవచ్చు. మంచు మనోజ్ “శ్రీ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తెలుగు సినీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక బాహుబలి సినిమాతో తమన్నా రేంజ్ మరో స్థాయికి చేరుకుంది. అయితే తమన్నా నటించిన తాజా సినిమా “గుర్తుందా శీతాకాలం”. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ హిట్ ఫిలిం లవ్ మాక్టైల్ కు రీమేక్ గా దర్శకుడు నాగశేఖర్ రూపొందిస్తున్నారు.

ఈనెల 9 వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన పెళ్ళి గురించి అడిగినప్పుడు తమన్న మాట్లాడుతూ.. ” అందరి ఇళ్లలో అమ్మాయిలకు పెళ్లి గురించి ప్రెషర్ ఉన్నట్లే మా ఇంట్లో కూడా ఎప్పటినుంచో పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటా. అది నా జీవితంలో కీలక నిర్ణయం కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీడియా సంస్థలు నాకు చాలా సంబంధాలు కుదిర్చాయి. ఒకసారి డాక్టర్ తో, మరోసారి వ్యాపారవేత్తతో పెళ్లి అంటూ నిర్ణయించేశారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, రూమర్స్ గురించి ఎక్కువగా ఆలోచించను. పెళ్ళి సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటా” అని చెప్పుకొచ్చింది తమన్నా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు