Pushpa : కథ మొత్తం పుష్ప2 లోనే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన భారీ హిట్ సినిమా పుష్ప ది రైజ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికీ చాలా మంది పుష్ప సినిమా డైలాగ్‌ల‌ను సంద‌ర్భాన్ని బ‌ట్టి త‌గ్గెదేలే అని వాడేస్తున్నారు. దీనికి సీక్వెల్ గా పుష్ప 2 రాబోతుంద‌ని ఎప్పుడో ప్ర‌క‌టించాడు సుకుమార్‌.

పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ అప్పుడు ప్రారంభ‌మ‌వుతుంది,  ఇప్పుడు ప్రారంభ‌మ‌వుతుంద‌ని  గత కొద్ది నెలల నుంచి మాట్లాడుకుంటున్నారే త‌ప్ప సినిమా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఇటీవ‌ల స్క్రిప్ట్ మొత్తాన్ని ద‌ర్శ‌కుడు సుకుమార్ సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇటీవ‌లే  సుకుమార్ పుష్ప 2 కి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. పార్ట్ 2 అంటే ఎమోష‌న‌ల్ క‌న్‌క్లూజ‌న్ ఉంటుందని చెప్పారు. పుష్ప‌కి ఇంటి పేరు లేదు క‌దా.. అత‌ని ఫాద‌ర్ తో ఉన్న‌ చైల్డ్ వుడ్ కూడా పార్ట్ 2లో చూపించ‌బోతున్నారు. అదే స‌మ‌యంలో బ్ర‌ద‌ర్స్ వారి మ‌ధ్య ఎమోష‌న్స్ ఎలా క‌నెక్ట‌యింది అనేది చూపించ‌నున్నారు. పుష్ప గందం చెక్క‌ల బిజినెస్ నేష‌న‌ల్ లెవ‌ల్‌కి తీసుకెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. పుష్ప పార్ట్ 1 కంటే పుష్ప పార్ట్ 2లోనే కథ  ముఖ్యమైన కథాంశం ఉందని చెప్పుకొచ్చారు  ద‌ర్శ‌కుడు సుకుమార్‌. మ‌రోవైపు న‌వంబ‌ర్ రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు