NTR30 : తగ్గని రూమర్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో  ఎన్టీఆర్ 30 సినిమా తెరకెక్కే విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందని ప్రకటించి చాలా రోజులే అవుతుంది. కానీ  ఈ సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు. ఇందుకు కారణం కథ ఓ కొలిక్కి రాలేదనే తెలుస్తోంది. మరోవైపు  ఈ చిత్రంలో హీరోయిన్ కూడా ఖరారు కాలేదు. ఎన్టీఆర్-కొరటాల కాంబోలో గతంలో జనతా గ్యారెజ్ సినిమా వచ్చి సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. 

ఇప్పటికే ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ నటించిన రామ్ చరణ్ మాత్రం శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమా మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. మరోవైపు ఇప్పటి వరకు అపజయం ఎరుగని కొరటాల శివ తన కెరీర్ లో మొదటి డిజాస్టర్ ను ఇటీవల చవిచూశాడు. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ‘ఆచార్య’ భారీ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ సినిమా సమీకరణాలు మారిపోయాయి. 

ప్రస్తుతం ఎన్టీఆర్ రేంజ్ కి తగ్గట్టు యూనివర్సల్ అప్పీల్ వచ్చే విధంగా కొరటాల శివ మరో పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఇక ఇప్పటికే ఇందులో చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక అని, ఆ తరువాత కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. కానీ ఇవ్వన్ని వట్టి రూమర్స్ గానే మిగిలిపోయాయి.  తాజాగా  ఎన్టీఆర్ 30లో  శ్రీలీల  హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపించాయి. కానీ అందులో వాస్తవం లేదని టాలీవుడ్ వర్గాల్లో టాక్. 

- Advertisement -

అయితే ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది మేకర్స్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. మూవీ టీం హీరోయిన్ పై స్పందించేంత వరకు ఇలాంటి రూమర్స్ మరిన్నీ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు