Simran: వామ్మో.. సిమ్రాన్ అంత మందితో ఎఫైర్ నడిపిందా?లిస్ట్ వైరల్..!

Simran: సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోయిన్ లేదా ఒక హీరో ఇతరులతో కాస్త చనువుగా ప్రవర్తించారు అంటే.. కచ్చితంగా వారి మధ్య ఎఫైర్ రూమర్స్ సృష్టించడం సహజం.. ఆ తర్వాత వాటిపై కొంతమంది స్పందిస్తారు.. మరి కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తారు.. అయితే మరికొంతమంది నిజంగానే ఎఫైర్ నడుపుతూ తమకు నచ్చినపుడు వారితో క్లోజ్ గా మూవ్ అవ్వడం.. ఆ తర్వాత విభేదాలు వస్తే విడిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు.. ఇక అలాంటి వారిలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కూడా ఒకరు.. ఈమె చాలా మందితో ఎఫైర్ నడిపిందని.. ఆ లిస్టు కూడా చాలా పెద్దదే అంటూ ఇప్పుడు ఒక వార్త తెరపైకి వచ్చింది..

సిమ్రాన్ ఎఫైర్ లిస్ట్..
ఇక సిమ్రాన్ ఎవరితోనైనా ఎఫైర్ పెట్టుకుంది అంటే అందులో మొదటిగా వినిపించే పేరు ప్రభుదేవా సోదరుడు రాజు సుందరం మాస్టర్.. చాలా సంవత్సరాలు సిమ్రాన్ ఈయనతో ప్రేమాయణం నడిపించింది. కానీ ఆ తర్వాత నయనతార , ప్రభుదేవా వ్యవహారం కోలీవుడ్లో దుమారం సృష్టించడంతో అప్పటి నుంచి సిమ్రాన్ సుందరం మాస్టర్ కి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయితే నయనతార, ప్రభుదేవా కారణంగానే సిమ్రాన్ సుందరం మాస్టర్ దూరమయ్యారనే వార్తలు కూడా తెరపై వినిపిస్తూ ఉంటాయి..

- Advertisement -

కమలహాసన్ తో ఎఫైర్..
విశ్వ నటుడు కమలహాసన్ తో కూడా ఈమె చాలా రోజులు ప్రేమలో ఉందని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.. కానీ అందులో నిజం లేకపోయింది.. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి పంచతంత్రం సినిమాలో ఘాటు రొమాన్స్ చేశారు.. ఈ సినిమా తర్వాతనే వీరిపై ఎఫైర్ రూమర్స్ చక్కర్లు కొట్టాయి.

హీరో అబ్బాస్ తో సిమ్రాన్ ప్రేమాయణం..
అంతేకాదు అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు యూత్ ఐకాన్ అబ్బాస్ తో కూడా సిమ్రాన్ చాలా రోజులు డేటింగ్ చేసిందట. కానీ ఎందుకు విడిపోయారు అన్న కారణాలు మాత్రం తెలియలేదు..

వైవాహిక జీవితం..
ఇలా కోలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా కొంతమంది హీరోలతో సిమ్రాన్ ఎఫైర్ నడిపిందనే వార్తలు గట్టిగానే వినిపించాయి.. కానీ అవన్నీ కేవలం అవకాశాల కోసం మాత్రమేనని, హీరో హీరోయిన్ మధ్య ఉండే రిలేషన్ మాత్రమే అని తెలుస్తోంది.. ఇక చివరిగా తన బాల్యమిత్రుడైన దీపక్ బగ్గా ను వివాహం చేసుకుంది సిమ్రాన్. ఆ తర్వాత ఈ జంటకు ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు.

సిమ్రాన్ సినిమాలే కాదు సీరియల్స్ కూడా..
ముంబైలో డిగ్రీ పూర్తి చేసి, మోడలింగ్ రంగంలో పనిచేసిన ఈమె ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. సిమ్రాన్ మొదట సనమ్ హర్ జాయే అనే హిందీ సినిమా ద్వారా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత తేరే మేరే సప్నే అనే చిత్రంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.. దక్షిణాదిలో మొదట మలయాళం సినిమా ఇంద్రప్రస్థం లో నటించిన ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళ్ చిత్రాలలో కూడా నటించి.. తమిళ చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా కూడా ఒకానొక సమయంలో పేరు దక్కించుకుంది.సినిమాలే కాదు సీరియల్స్ లో కూడా నటించింది సిమ్రాన్.. సుందరకాండ అనే సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు