Sri Ranga Neethulu : ఇండస్ట్రీ లో సుహాస్ సినిమా చర్చే లేదేంటి?

Sri Ranga Neethulu : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన సుహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో చిన్న షార్ట్ ఫిలిమ్స్ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా మారి యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో కుర్ర హీరో సుహాస్ కొత్త సినిమా ఏదైనా వస్తోందంటే ఖచ్చితంగా దాని తాలూకు టాక్ బిజినెస్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఉంటుంది. బడ్జెట్ తక్కువైనా సరే సిన్సియర్ గా మంచి కథాబలం ఉన్న సినిమాలు ట్రై చేస్తాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. దానికి కలర్ ఫోటో తర్వాత చేసిన సినిమాలే ఉదాహరణ. లాస్ట్ ఇయర్ రైటర్ పద్మభూషణ్ తో వచ్చి మంచి హిట్టు కొట్టిన సుహాస్ ఈ ఇయర్ ఫిబ్రవరి లో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో వచ్చి మరో సక్సెస్ కొట్టాడు. అంతే కాకుండా హీరోగా హ్యాట్రిక్ విజయాల్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది మొత్తం కలిపి ఏకంగా ఆరు సినిమాల రిలీజులు పెట్టుకున్నాడు సుహాస్. ఇక ఈ సినిమాల తర్వాత సుహాస్ సినిమా అంటే ఆడియన్స్ సౌండ్ పది రోజుల ముందు నుండే ఉంటుందని భావించారు. కానీ లేటెస్ట్ గా సుహాస్ నటించిన సినిమా రిలీజ్ అవుతుందని కూడా చాలా మందికి తెలియని పరిస్థితి.

ఒక ప్రమోషన్ కూడా లేదు..

అయితే సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత నటించిన కొత్త మూవీ ‘శ్రీరంగనీతులు’ ఈ సినిమా రేపు అంటే ఏప్రిల్ 11న థియేటర్లలో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. కానీ ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఆడియన్స్ చాలా మందికి తెలీని పరిస్థితి. ప్రమోషన్ల పరంగా ఈ చిత్ర యూనిట్ అంతగా శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించడం లేదు. శ్రీ రంగ నీతులు ట్రైలర్ వచ్చి కూడా చాలా రోజులయ్యింది. బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్, కంచరపాలెం కార్తీక్ రత్నం కూడా రెండు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే సుహాస్ తాను ఈ సినిమాలో మెయిన్ హీరో కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు, కానీ చిన్నదయినా పెద్దదయినా క్యారెక్టర్ చేశాడు కాబట్టి దాన్ని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లేందుకు పబ్లిసిటీలో భాగమవ్వాలి. కానీ సుహాస్ తో పాటు, ఇతర హీరోలు విరాజ్, కార్తీక్ రత్నం కూడా లైట్ తీసుకున్నారనిపిస్తుంది. అన్నిటికి మించి ఈ సినిమా దర్శకుడు, నిర్మాత సహా మూవీ టీమ్ ఎవరూ ఏ దిశగానూ ప్రమోషన్ గురించి చొరవ తీసుకోవడం లేదు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ కి ఒక్క రోజు ముందు హైదరాబాద్ లో ప్రీమియర్లు వేస్తున్నట్టు బుక్ మై షో చూశాక చాలా మందికి సినిమా వస్తుందని తెలిసింది. అయితే కనీసం అందులో ఒక్క థియేటర్ కి కూడా సరైన బుకింగ్స్ జరగడం లేదు.

లైట్ తీసుకుంటే నిర్మాత నష్టపోవాల్సిందే?

అయితే సుహాస్ నటించిన శ్రీరంగ నీతులు(Sri Ranga Neethulu) సినిమాని హీరోలు లేకున్నా కనీసం టెక్నిషియన్స్ తో కలిసి మేకర్స్ ప్రమోట్ చేస్తే మంచిదని లేదంటే భారీ నష్టాలు నిర్మాత కోరి తెచ్చుకున్నట్టు అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అసలే ఐపీఎల్ సీజన్, పైగా ఎన్నికల వాతావరణం, బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య శ్రీరంగనీతులు ఇంత సైలెంట్ గా ఉంటే కష్టం. పైగా ఈ సినిమా రిలీజ్ రోజు కాంపిటీషన్ తక్కువేమీ లేదు. విజయ్ ఆంటోనీ లవ్ గురు, కోన వెంకట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది కూడా ఏప్రిల్ 11న రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలీవుడ్ మల్టీస్టారర్ బడేమియా చోటేమియాని తెలుగులో కూడా డబ్ చేసి వదులుతున్నారు. అజయ్ దేవగన్ మైదాన్ కి ప్రీమియర్ల నుంచి చాలా పాజిటివ్ టాక్ ఉంది. దీన్ని బట్టి సిటీ ఏరియాల్లో శ్రీరంగనీతులు గురించి జనాల్లో ఆసక్తి పెరగాలంటే మేకర్స్ ఏదైనా అనూహ్యమైన ప్రమోషన్ యాక్టివిటీ చేయాలి. లేదంటే సినిమా షెడ్డుకెళ్ళిపోవాల్సిందే. మరి రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు