Pushpa -2: పుష్ప-2 లో అల్లు అర్జున్ కట్టిన చీర స్పెషల్ ఏంటో తెలుసా..?

Pushpa -2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప 2.. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసింది.. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న చిత్ర బృందం పుష్ప 2 సినిమా టీజర్ ని కూడా రిలీజ్ చేయగా..ఈ టీజర్ ఊహించని రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.. అటు అభిమానులకు కూడా చాలాకాలం తర్వాత బన్నీ మంచి ట్రీట్ ఇచ్చారని చెప్పవచ్చు.

చీర కట్టులో బన్నీ విశ్వరూపం..
ఇకపోతే ఈ టీజర్ లో బన్నీ చీరకట్టులో కనిపించి తనలో ఉన్న నటన టాలెంట్ ని మరొకసారి అభిమానులకు చూపించారనే చెప్పాలి.. టీజర్ చూస్తుంటే.. గంగమ్మ జాతర ఎపిసోడ్ ఈ సినిమాకి చాలా హైలైట్ గా నిలవబోతోంది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చీర కట్టుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.. అంతే కాదు బన్నీ గెటప్ కి అందరూ షాక్ అయ్యారు కూడా. ఇందులో అల్లు అర్జున్ చీర ధరించడం ఒక ఎత్తు అయితే ఆ చీర యొక్క స్పెషాలిటీ తెలిసి ఇప్పుడు అందరు మరింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ కట్టుకున్న చీర ఎవరిదో తెలుసా? అంటూ ఇప్పుడు ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది..

- Advertisement -

చీర స్పెషాలిటీ అదే..
మరి అల్లు అర్జున్ కట్టుకున్న ఆ చీర స్పెషాలిటీ ఏమిటంటే.. అది వాళ్ళ అమ్మదట.. సెంటిమెంట్ గా ఉంటుంది అంటూ సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు ఈ సినిమాకి ఈ ఫైట్ సీన్ చాలా హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు సినీ ప్రేక్షకులు.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఈ ఫైట్ సీన్ ఇంటర్వెల్ లో రాబోతున్నట్లు కొత్త వార్త తెరపైకి వచ్చింది.. మొత్తానికైతే అల్లు అర్జున్ సుకుమార్ సలహా మేరకు తన తల్లి చీర కట్టుకొని చాలా అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేశారని టీజర్ చూస్తే అర్థమవుతుంది ఇక థియేటర్లలో ఈ సన్నివేశాలు ఎంతలా ఉంటాయో ఊహించుకోవచ్చు. మొత్తానికి అయితే అల్లు అర్జున్ ఈ సినిమాతో మరో ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

పుష్ప 2 తారాగణం:
ఇకపోతే ఇప్పటికే సుకుమార్ , బన్నీ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాలో నటించిన చాలామంది స్టార్ కాస్ట్ పుష్ప 2 లో కూడా కంటిన్యూ అవుతున్నారని తెలుస్తోంది .ఇక ఈ సినిమాలో రావు రమేష్, ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్న, అనసూయ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే వీరంతా కూడా పుష్ప మొదటి భాగంలో తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఈ రెండవ భాగంతో మరెంతలా ఆకట్టుకుంటారో చూడాలి. మొత్తానికైతే పుష్ప 2 కోసం అటు సౌత్ ఇండియన్ ప్రేక్షకులే కాదు ఇప్పుడు నార్త్ ఇండియన్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాతో కుంభ స్థలాన్ని ఢీ కొట్టడానికి సిద్ధమవుతున్నారు బన్నీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు