Allu Arjun : అట్లీ తో ఆగలేదు గాని.. ఆ విషయంలో పక్కా గా ఉన్న బన్నీ!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మారుమోగిపోతుంది. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ అయిన పుష్ప ది రూల్ టీజర్ తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో తనదైన శైలిని చూపిస్తూ అలా మార్కెట్ పెంచుకుంటూ పోతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక పుష్ప తర్వాత దాని రెండో పార్ట్ పుష్ప ది రూల్ లో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కెరియర్లో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు పుష్ప సినిమాకి ఎత్తు. పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డును తీసుకొచ్చిన సినిమా పుష్ప అని చెప్పొచ్చు. దీనికి కారణం సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటేనే ఒక హై రేంజ్ లో ఉంటుంది. దానికి తోడు అల్లు అర్జున్ కూడా ఈ స్థాయిలో ఉండటానికి సుకుమార్ కారణమంటూ చాలా వేదికల పైన చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా తర్వాత మంచి విభిన్నమైన సినిమాలను ఎన్నుకుంటూ బిజీగా మారబోతున్నాడు.

అట్లీ తో ఆగిపోలేదు?

అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప ది రూల్ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తర్వాత సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అల్లు అర్జున్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ న్యూస్ ఇప్పుడు కాదు దాదాపు ఆరు నెలల నుండి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇదిలా ఉండగా కోలీవుడ్ లో రాజారాణి తో డైరెక్టర్ అయిన అట్లీ తమిళ్ లో వరుసగా విజయ్ దళపతి తో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక రీసెంట్ గా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో కూడా జవాన్ అనే సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా అద్భుతమైన కలెక్షన్స్ సాధించాడు అట్లీ. ఈ సినిమాతో నేషనల్ వైడ్ గా అట్లీ రేంజ్ వేరే లెవెల్లో పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు అట్లీ నుంచి సినిమా కోసం సౌత్ మొత్తం ఎదురుచూస్తుంది. ఇకపోతే అట్లీ అల్లు అర్జున్ కాంబో ఉందని ఆల్మోస్ట్ ఈ సినిమాను ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా అనౌన్స్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. కాని అది జరగలేదు. దీంతో వీళ్ళ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అట్లీ బన్నీ సినిమా ఆగిపోలేదట.

క్లారిటీ కోసం వెయిటింగ్?

ఇక అల్లు అర్జున్ అట్లీ కాంబోలో సినిమా వస్తుందన్నప్పటి నుండి ట్రేడ్ వర్గాల్లో మరో వెయ్యి కోట్ల సినిమా అని ఫిక్స్ అయిపోయారు. కానీ అల్లు అర్జున్ బర్త్ డే కి అనౌన్స్ మెంట్ రాకపోవడంతో సినిమా ఆగిపోయిందనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అట్లీ తో సినిమా ఖచ్చితంగా ఉంటుందని బన్నీ సన్నిహిత వర్గాల నుండి సమాచారం వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఓ వైపు పుష్ప 2 లో బిజీ గా ఉంటూనే అట్లీ తో కథ వింటున్నాడట. స్క్రిప్ట్ లో పలు ఛేంజస్ చేయమన్నట్టు సమాచారం. ఇక స్క్రిప్ట్ డెవలెప్మెంట్ అయ్యాకే, ఫైనల్ స్టోరీ లాక్ అయ్యాకే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇద్దామని ఫిక్స్ అయ్యారట.
ఇక పుష్ప 2 షూట్ పూర్తయ్యేలోగా ఈ సినిమా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు