Jack : టిల్లుగాని వల్ల ‘జాక్’ పాట్ కొట్టారు..!

Jack : టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ మార్కెట్ వాల్యూ ఓ రేంజ్ లో పెరిగిపోయిందని చెప్పాలి. రెండేళ్ల కింద సిద్ధూ జొన్నలగడ్డ ఓ మామూలు చిన్న సినిమాలు, కామెడీ ఎంటర్టైనర్ లు చేసుకునే హీరో. నిజానికి సిద్ధూ జొన్నలగడ్డ గురించి సిటీ ఏరియాల్లో తప్ప రూరల్ ఏరియాల్లో ఈ హీరో గురించి విన్న సందర్భాలు తక్కువే. కానీ ఎప్పుడైతే డీజే టిల్లు సౌండ్ మోగిందో అప్పటినుండి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ డీజే సౌండ్ పెట్టిన ఈ టిల్లుగాని పాటలు లేకుండా మ్యూజిక్ ఉండేది కాదు. ఒక చిన్న ఆర్టిస్ట్ గా సైడ్ రోల్స్ చేసుకుంటూ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధూ జొన్నలగడ్డ గుంటూరు టాకీస్ అనే కామెడీ సినిమాతో బ్రేక్ ఇచ్చాడు. అయితే సిద్ధూ కెరీర్ ని మార్చింది మాత్రం డీజే టిల్లు సినిమాయే. ఏ ముహూర్తాన ఈ సినిమా స్టార్ట్ అయిందో గాని ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందని చెప్పొచ్చు. అప్పట్లో అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో రిలీజ్ అయి కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇక రీసెంట్ గా దీనికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ పార్ట్ కి మించి 4 రెట్లు భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.

టిల్లు స్క్వేర్ తో ‘జాక్’ పాట్..

ఇక సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ సినిమాల డిమాండ్ మారిపోయింది. రీసెంట్ గా క్రేజీ అంచనాలతో రిలీజ్ అయిన సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ఏకంగా వంద కోట్ల వసూళ్ళని అందుకుని ఆశ్చర్యపరిచింది. టిల్లు స్క్వేర్ హిట్ అవుతుందని అందరూ నమ్మారు. కానీ ఈ రేంజ్ లో భారీ డీజే సౌండ్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇక సినిమా రిలీజ్ అయి రెండు వారాలైనా, దీనికి పోటీగా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయినా టిల్లు స్క్వేర్ థియేటర్లలో ఓ రేంజ్ రచ్చ చేస్తుంది. ఇక సినిమా రిలీజ్ అయిన పలు ఏరియాల్లో బయ్యర్లకు భారీ లాభాలని అందించి సిద్ధూ జొన్నలగడ్డ తదుపరి సినిమాలపై ఆసక్తిని పెంచేలా చేసింది. ఇక సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్(Jack) అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బయ్యర్లు ఇప్పటినుండే ఎగబడుతున్నారట.

తెలుగు రాష్ట్రాల్లో హై డిమాండ్..

టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ చేస్తున్న ‘జాక్’ సినిమాను ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను SVCC బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది. వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ వచ్చింది. టిల్లు స్క్వేర్ తర్వాత ఈ సినిమాకి “జాక్” పాట్ తగిలిందని చెప్పాలి. టిల్లు స్క్వేర్ జోరు వల్ల సిద్ధూ జొన్నలగడ్డ మార్కెట్ పెరగగా, నెక్స్ట్ చేస్తున్న జాక్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. జాక్ కి అన్ని ఏరియాల నుంచి మునుపటికంటే భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా కు బయ్యర్లు ఎగబడుతున్నారు. యూత్ లో క్రేజ్ తో పాటు బిజినెస్ పరంగానూ సత్తా చాటుతోన్న సిద్ధుపై ఇప్పుడు ట్రేడ్ లో భారీ అంచనాలున్నాయి. సమ్మర్ ఎండింగ్ లో రానున్న ఈ సినిమా దాదాపు 30 కోట్లకి పైగా బిజినెస్ చేయొచ్చని ట్రేడ్ వర్గాల సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు