SIDKIARA: ఫస్ట్ నైట్ గురించి ఓపెన్ అయిన కియారా

బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న కియారా అద్వానీ – స్టార్ హీరో సిద్ధార్ద్ మల్హోత్రా ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ లోని సూర్యఘడ్ ప్యాలెస్ లో ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా – సిద్ధార్థ్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక ఫిబ్రవరి 12న ముంబైలో వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది.

ఇక వెంటనే ఈ జంట హనీమూన్ కి వెళ్ళింది. అయితే అక్కడినుండి ముంబై తిరిగి వస్తుండగా ఎయిర్పోర్టులో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈ క్రమంలో కొంతమంది హనీమూన్ ఎలా జరిగిందంటూ ప్రశ్నించారు. దీనికి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన కియారా.. తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది.

కియారా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ” సంథింగ్ అబౌట్ దట్ నైట్.. సంథింగ్ రియల్లీ స్పెషల్” అని పోస్ట్ చేసింది. అంటే.. “ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. నా లైఫ్ లో మర్చిపోలేని రాత్రి, ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను” అంటూ సిద్ధార్ద్ తో ఉన్న బ్యూటిఫుల్ ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కామెంట్ బాక్స్ లో ఫైర్ ఎమోజీలు, లవ్ సింబల్స్ తో నింపేశారు. మరి కొంతమంది ఏంటి కియారా ఎంత పని చేశావు అంటూ నటిజెన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది కియారా అద్వానీ ఆ రేంజ్ లో ఫస్ట్ నైట్ ని ఎంజాయ్ చేసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు