Shraddha Das: అందాలు ఇన్‌స్టాకే పరిమితమా? ఇక సిల్వర్ స్క్రీన్‌కి దూరమేనా?

సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్లు చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ రోజువారీ పనులను కెమెరాల్లో బంధించి, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసి, తమ అభిమానులతో పంచుకుంటారు. ఇందులో హీరోల కంటే హీరోయిన్లే కాస్త ముందు వరుసలో ఉంటారు. కొంత మంది హీరోయిన్లు తమ రోజువారి యాక్టివిటీని పోస్టు చేస్తుంటే, మరి కొంతమంది తమ అందాలను ఇన్‌స్టా అకౌంట్స్ లో షేర్ చేసి కుర్రకారును ఊరిస్తారు. అలా చేసే వారిలో శ్రద్ధా దాస్ ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

శ్రద్ద ఒక తెలుగులోనే కాదు.. దాదాపు అన్ని భాషల్లో హీరోయిన్ గా నటించింది. తన అందం, అభినయంతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ, ఈ మధ్య శ్రద్ధ టైం అస్సలు బాగాలేదు. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది. దీంతో తన ఫోకస్… సిల్వర్ స్క్రీన్ కంటే, ఇన్‌స్టా స్క్రీన్ పై ఎక్కువ పెట్టింది. పొట్టి పొట్టి డ్రెస్ లతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ, యూత్ కి మండుటెండల్లో చమటలు పట్టిస్తుంది. శ్రద్ధా తాజాగా మరి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.

అయితే ఈ అందాలను ఇన్‌స్టా స్క్రీన్ కంటే, సిల్వర్ స్క్రీన్ పై చూస్తే బాగుంటుందని తన అభిమానులు అభిప్రాయపడతున్నారు. ‘ఇంకెన్నీ రోజులు ఈ సోషల్ మీడియాకి పరిమితమవుతావు… మంచి సినిమాలు చేసి మంచి కమ్ బ్యాక్ ఇవ్వు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, శ్రద్ధా దాస్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలైనా హిట్ అవుతాయా? కమ్ బ్యాక్ ఇస్తుందా అనేది చూడాలి మరి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు