Sekhar Kammula : స్టైల్ మార్చితే హిట్..

టాలీవుడ్ లో లవ్ స్టోరీ సినిమాలు.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ కు కెరాఫ్ అడ్రస్ ఎవరంటే ? ఎలాంటి అనుమానాలు లేకుండా ఒకే ఒక్క సమాధానం వస్తోంది. అదేే శేఖర్ కమ్ముల. ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన తొలి సినిమా డాలర్ డ్రీమ్స్ నుంచి ఇటీవల వచ్చిన లవ్ స్టోరీ వరకు ఏ మాత్రం సిరీయస్ టచ్ లేకుండా లవ్ స్టోరీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కే పరిమితం అయ్యారు. మధ్యలో రానా దగ్గుబాటి తో కలిసి చేసిన లీడర్, నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన అనామిక సినిమాలకు మినహాయింపు ఉంటుంది. తన జానర్ నుంచి బయటకు వచ్చి చేసిన ఈ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.

అంతే కాదు లీడర్ సినిమా.. 25 గ్రేటెస్ట్ తెలుగు ఫిలిమ్స్ అఫ్ ది డికేడ్ లో స్థానాన్ని కూడా సంపాదించుకుంది. లీడర్ తర్వాత మళ్లీ అలాంటి సినిమాను చేయలేదు. కానీ ప్రస్తుతం శేఖర్ కమ్ముల నుంచి లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రాబోతుందని తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీారో ధనుష్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. దీనిపై అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చింది. కానీ నేడు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

అయితే ఈ సినిమా గురించి సినిమా వర్గాల్లో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే ? శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సూపర్ గుడ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీ కంటెంట్ తో వచ్చేది కాదట. పక్క పొలిటికల్ డ్రామాతో ఈ మూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నట్టు టాక్. పొలిటికల్ డ్రామాతో పాటు థ్రిల్లర్ జానర్ ను కూడా ధనుష్ కోసం శేఖర్ కమ్ముల టచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఒక వేళ ధనుష్ తో శేఖర్ కమ్ముల ఇలాంటి పొలిటికల్ థ్రిల్లర్ జానర్ లో మూవీ కన్ఫామ్ అయితే.. లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చే అవకాశం లేకపోలేదు.

- Advertisement -

శేఖర్ కమ్ముల చాలా ఏళ్ల క్రితం పొలిటికల్ జానర్ ను టచ్ చేస్తేనే మంచి ఫలితం వచ్చింది. ప్రస్తుతం కాలంలో ఈ జానర్ లో సినిమా వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోగలం. అందుకే కాబోలు.. ధనుష్ కూడా శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ ను ఓకే చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు