Sarkaaru Noukari: పాపం సునీత కొడుకు… పట్టించుకునే వారే లేరా?

పాపులర్ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న లేటెస్ట్ మూవీ “సర్కారు నౌకరి”. ఈ మూవీలో భావన హీరోయిన్ గా నటిస్తుండగా, గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక “సర్కారు నౌకరి” మూవీని ఆర్కే టెలి షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా “సర్కారు నౌకరి” మూవీ థియేటర్లలోకి రాబోతోంది. అయితే స్టార్స్ సింగర్ కొడుకు అయినప్పటికీ సునీత కొడుకును ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పైగా ఈ మూవీకి అసలు బిజినెస్ జరగట్లేదా? తప్పని పరిస్థితిలో థియేటర్లలో విడుదల చేస్తున్నారా? అనే వివరాల్లోకి వెళితే…

“సర్కారు నౌకరి” మూవీకి బిజినెస్ అవ్వట్లేదనే టాక్ ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ మూవీని ఓటీటి కోసం తీశారట. కానీ ఏ ఓటీటి సంస్థ కూడా ఈ మూవీని తీసుకోవడానికి ఆసక్తిని కనబరచట్లేదట. సునీత భర్త రామ్ వీరపనేని ఈ మూవీని వ్యూయర్షిప్ బేస్ మీద అమెజాన్, ఆహా వంటి ఓటీటి సంస్థలకు “సర్కార్ నౌకరి” మూవీ రైట్స్ డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నించారట. కానీ వాళ్లు కూడా ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో “సర్కారు నౌకరీ” మూవీని థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో ఆకాష్ కు దెబ్బ తప్పలేదు. కొత్త మొహాలు కావడంతో డిజిటల్ ప్రమోషన్స్ టీం కూడా ప్రమోషన్స్ చేయట్లేదు. ఇక ఈ విషయం బయటకు రావడంతో స్టార్ సింగర్ కొడుకు అయినప్పటికీ ఆకాష్ కు ఈ గతి ఏంటో అనుకుంటున్నారు.

మరోవైపు ఈ మూవీకి స్టార్స్ సపోర్ట్ గట్టిగానే ఉంది. “సర్కార్ నౌకరి” మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాఘవేంద్రరావు, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి లతో పాటు సునీత కూడా పాల్గొంది. అయినప్పటికీ ఈ మూవీపై కనీస హైప్ కూడా రాలేదు. మరి ఈ నేపథ్యంలో థియేటర్లలోకి రాబోతున్న “సర్కార్ నౌకరి’ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ మూవీలో కండోమ్ వల్ల కష్టాలు పడిన పెళ్లయిన యువకుడిగా ఆకాష్ నటించాడు. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా రాబోతున్న “సర్కారు నౌకరి” మూవీ ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కనీసం ఓటిటి బిజినెస్ చేయలేకపోయిన ఈ మూవీ థియేటర్లలో ఎలా ఆడుతుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు