యశోద.. ప్రస్తుతం తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎప్పుడెప్పడా అని ఎదురుచూస్తున్న సినిమా. దర్శకనిర్మాతలు ముందుగా ఈ సినిమాను 3 కోట్లతో తెరకెక్కిస్తామని అనుకున్నారు. కానీ, సామ్ రంగంలోకి దిగకా.. అది 40 కోట్ల వరకు పెరిగింది. సామ్, దర్శక నిర్మాతలు అంత నమ్మకంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాను సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేసిన స్టోరీ యశోద
అంటూ సామ్ కూడా చెప్పింది. దీంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి.
నిజానికి యశోద ప్రాజెక్ట్ లో సమంత ఉంటుంది అని తెలిసిన నాటి నుంచే సినిమాపై హైప్ పెరుగుతూ వచ్చింది. అయితే ఇటీవల సామ్ మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. దీని తర్వాత ప్రమోషన్లకు దూరం ఉండబోతుందని వార్తలువచ్చాయి. సామ్ ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్లు కష్టమే అని మూవీ టీం కూడా భావించారు. దీని వల్ల యశోద ఫలితంపై ప్రభావం చూపొచ్చు అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే అనూహ్యంగా సామ్ ఇంటర్వ్యూలో కనిపించారు.
Read More: Chiranjeevi : వందశాతం ఎంటర్ టైన్ మెంట్ చిత్రం వాల్తేరు వీరయ్య
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈ యశోదను ఇంటర్వ్యూ చేసింది. యూట్యూబ్ లో ఈ ఇంటర్వ్యూకు మిలియన్ ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. ఈ ఒక్క దెబ్బతో అన్ని సోషల్ మీడియాలలో ట్రెండింగ్ లోకి యశోద, సమంత వచ్చారు. ఇప్పటి వరకు డల్ గా జరిగిన ప్రమోషన్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ నెల 11న విడుదల కాబోయే ఈ సినిమాకు ఈ ఇంటర్వ్యూ ఒక మైలేజ్ లా పని చేసింది. సామ్ ఇంటర్వ్యూ కు వచ్చిన స్పందన చూస్తుంటే.. మళ్లీ సామ్ కేవలం ఒక వీడియో రిలీజ్ చేసినా సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతాయని అర్థమవుతుంది.
Read More: Ranbir Kapoor : నా పక్కనుంటే చాలు
సినిమా ఇండస్ట్రీలో ఏం మాట్లాడినా ఆచి...
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వచ్చే వారు...
టాలీవుడ్ టాప్ డ్యాన్సర్ ఎవరు? ఈ ప్రశ్నకు...
టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్...
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన...