Samajavaragamana: ఇదొక మినీ సైజ్ “నువ్వు నాకు నచ్చావ్”

రోజులు మారుతున్న కొద్దీ పరిస్థితులు మారడం సహజం. అలానే సినీ పరిశ్రమలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అందరికి తెలిసిన కథనే చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేసే డైరెక్టర్స్ ప్రస్తుతం చాలామంది ఉన్నారు. దాదాపుగా కథలన్నీ ఒకటే, కానీ దానిని చూపించే విధానమే కీలకం అని కొంతమంది దర్శకులు నమ్ముతారు. కానీ అతి తక్కువ మంది దర్శకులు మాత్రమే సినిమా అంటే, ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని అందించాలి. ఒక రెండు గంటలపాటు వాడికున్న ప్రాబ్లెమ్స్ అన్ని మర్చిపోవాలని అనుకుంటారు. రీసెంట్ టైమ్స్ లో ఇటువంటి దర్శకులు, సినిమాలు అరుదు.

కానీ రీసెంట్ గా రిలీజైన ఒక సినిమా ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంటుంది. మళ్ళీ ఫ్యామిలీ అంతా చక్కగా కూర్చుని హాయిగా నవ్వుకునేలా చేస్తుంది. ఆ సినిమాయే “సామజవరగమన”. శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించిన సినిమా “సామజవరగమన”. ఒక మాములు కథను అందంగా, హాయిగా చూపించిన సినిమా ఇది.

బేసిక్ గా ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.
రీసెంట్ టైమ్స్ లో ఫ్యామిలీ తో పాటు చూస్తూ హాయిగా నవ్వుకున్న సినిమా ఏదైనా ఉందంటే అది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “అలవైకుంఠపురంలో” అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ తో పాటు కూర్చుని నవ్వుకున్నా సినిమా అంటే జాతిరత్నాలు. ఆ సినిమాలు తరువాత అంతటి క్లీన్ కామెడీ ఉన్న సినిమా మాత్రం “సామజవరగమన”
ఈ రోజుల్లో ఒక సినిమా రెండోసారి చూడటం రేర్, కానీ ఈ సినిమాకి అంతా వర్త్ ఉంది.

- Advertisement -

ఇప్పటికి కొన్ని సినిమాలు టీవిలో ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టవ్.
నువ్వు నాకు నచ్చావ్ , మల్లీశ్వరి , అతడు , మన్మధుడు లాంటి సినిమాలు అందుకు మంచి ఉదహరణ. ఈ సినిమాల్లో ఆయా పాత్రలకు ఉన్న ప్రాముఖ్యత , ఆ డైలాగ్స్ మనలను ఆకట్టుకున్నాయి ఈ సినిమా కూడా దాదాపుగా అంతే అని చెప్పొచ్చు. డిగ్రీ పాస్ కాలేని సగటు మిడిల్ క్లాస్ తండ్రిగా నరేష్ నటన, కులశేఖర్ పాత్రలో వెన్నెలకిషోర్, బాలు పాత్రలో శ్రీవిష్ణు నటించిన తీరు ఈ సినిమాకి కీలకం.రచయితగా భాను భోగవరపు ఈ సినిమాతో మంచి పేరు సాధిస్తాడు.డైలాగ్ రచయితగా నందు సవిరిగాన మంచి సక్సెస్ సాధించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు