God Father : బాలీవుడ్ హీరో ’చిరు‘ స్టెప్పులు

రీ- ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్నాడు. ఆచార్య అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు చిరు. ప్రస్తుతం చిరంజీవి మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి “గాడ్ ఫాదర్”. ఈ సినిమాను డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ఫిలిం లూసిఫర్ రీమేకే ఈ “గాడ్ ఫాదర్”. సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి దీనిని నిర్మిస్తున్నాయి.

దీంతో ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన చిరు ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ తో సినిమాపై హైప్ పెరిగింది. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ గాడ్ ఫాదర్ షూటింగ్లో జాయిన్ అయిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. సల్మాన్ ఖాన్ తో డాన్స్ చేస్తున్న ఫోటోను చిరంజీవి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ ను ట్యాగ్ చేస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు. ‘తొలిసారిగా సల్మాన్ ఖాన్ తో కలిసి డాన్స్ చేయడం ఎంతో అద్భుతంగా ఉంది. తప్పకుండా ఇది ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరికీ మంచి ఐ ఫీస్ట్ ను అందిస్తుంది’ అంటూ తన పోస్టులో తెలిపారు చిరంజీవి. అలాగే సల్మాన్ ఖాన్, చిరంజీవి కలిసి డ్యాన్స్ చేస్తున్న సాంగ్ కు ప్రభుదేవ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడని చిరు తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు