Salar :హైదరాబాద్ లో “సలార్” కొత్త షెడ్యూల్..

హోంభలే ఫిలిమ్స్ బ్యానర్ పై బ్లాక్ బాస్టర్ కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సలార్. శృతిహాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. పృధ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరి రావు, కన్నడ నటుడు మధు గురుస్వామి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేజిఎఫ్ రెండు భాగాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన రవి బస్రుర్ ఈ సినిమాకి కూడా స్వరాలు సమకూర్చుతున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్, 2023లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. మొన్నటిదాకా ఈ మూవీ షూటింగ్ ని తెలంగాణలోని గోదావరిఖని కోల్ మైన్స్ లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రీకరణ సమయంలో ప్రభాస్ లుక్ కూడా బయటపడింది.

అందులో ప్రభాస్ గెటప్ చాలా రఫ్ గా కనిపిస్తుండగా.. అతను ఇంతకుముందు చూడనంత వైలెంట్ గా కనిపిస్తున్నాడు. ఇక అక్కడ షూటింగ్ ని ముగించుకొని తాజాగా హైదరాబాదులో కొత్త షెడ్యూల్ ప్రారంభించుకుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా ప్రభాస్ తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజులపాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో మరో కీలక షెడ్యూల్ ని పూర్తి చేసి మార్చి నుంచి క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటిస్తోంది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుండగా ఈ చిత్రం త్వరలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు