RRR: చాలా సంవత్సరాలు తరువాత

ఎన్నో సినిమాలు వస్తుంటాయి , పోతుంటాయి. కొన్ని మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడతాయి. ఇంకొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి . అలా చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో ట్రిపుల్ ఆర్ ఒకటి.
ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్స్ లో రెండు వారలు ఆడటమే గగనం.
మూడోవారం ఓటిటి లోకి వచ్చేస్తుంది. ఒక 100 రోజులు పోస్టర్ చూసి చాలా రోజులు అయింది, అంతవరకు ఎందుకు 50 రోజులు పోస్టర్ చూసి కూడా చాలారోజులే అయింది.

అటువంటి తరుణంలో ట్రిపుల్ ఆర్ సినిమా నేటికీ 50 రోజులు పూర్తి చేసుకుంది. పూర్తి చేసుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంకా 500 థియేటర్స్ లో ప్రదర్శించబడుతుంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ ను కొల్లగొట్టి తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది.

చరణ్ , తారక్ ల నట విశ్వరూపానికి ప్రపంచమే ఫిదా అయింది,
ఈ సినిమా ఈ నెల తారక్ పుట్టినరోజు సందర్బంగా జీ-5 ఓటిటి లోకి రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు