Keerthy Suresh : కిర్తీకి హిట్ అందిందా..?

సీనియర్ హీరోయిన్ మేనక కూతురుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను నిర్మించుకుంది. నేను శైలజ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ, ఏకంగా పవర్ స్టార్ “అజ్ఞాతవాసి” సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ మూవీ డిజాస్టార్ గా మిగిలినా.. లక్ వెన్నంటే ఉండి, నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “మహానటి” సినిమాలో అవకాశం వచ్చింది.

ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్, అంతటి విజయాన్ని మళ్ళీ అందుకోలేదు. చియాన్ విక్రమ్ తో ’స్వామి 2’, విశాల్ తో నటించిన ’పందెం కోడి – 2’ ఆ తర్వాత ’పెంగ్విన్’, ’మిస్ ఇండియా’, ’రంగ్ దే’ ’గుడ్ లక్ సఖి’ ఈ సినిమాలన్నీ కీర్తి సురేష్ కు నిరాశనే మిగిల్చాయి.

అయినా కీర్తి సురేష్ అవకాశాలు మాత్రం తగ్గ లేదు. కీర్తి సురేష్ లేటెస్ట్ గా నటించిన సర్కారు వారి పాట ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో కావడంతో ఈ భామ, భారీ అంచనాలు పెట్టుకుంది. తన కెరీర్ లో నాలుగేళ్ల నుండి అందని హిట్ ను, ఈ మూవీతో కొట్టేయాలని అనుకుంది.

- Advertisement -

సర్కారు వారి పాట తొలి రోజు మిశ్రమ ఫలితాన్ని అందుకున్నా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆశ్చర్యపరిచే విధంగా 36.63 కోట్ల కలెక్షన్లను రాబట్టి రేసులో నిలిచింది. ఈ వీకెండ్ లో మరింత జోష్ తో ఈ మూవీ వసూళ్లు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో కీర్తికి హిట్ అందినట్టే అని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు