Ram : గంపెడు ఆశలతో..

టాలీవుడ్ లో టైర్ 2 హీరోల్లో కాస్త ఎక్కువ గుర్తింపు ఉన్న హీరో రామ్ పోతినేని. యూత్ మెచ్చే సినిమాలను చేస్తూ.. మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. మాస్ ఆడియన్స్ కు కూడా రామ్ పోతినేని దగ్గరయ్యాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మాస్ ఆడియన్స్ కు ఎంత కనెక్ట్ అయిందో.. అందరికీ తెలుసు. ఇది సూపర్ హిట్ తర్వాత అంతటి విజయం దక్కించుకోవడానికి రామ్ కు చాలా సమయం పడుతుంది.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్.. రెడ్, ది వారియర్ లాంటి సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేవు. దీంతో రామ్ ఆశలన్నీ బోయపాటి శ్రీను పైనే పెట్టుకున్నాడు. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రామ్ పోతినేని సినీ కెరీర్ కు ఎలాంటి ప్రమాదం రావొద్దంటే RAPO20 తప్పనిసరిగా హిట్ కావాలి.

దీని కోసం బోయపాటి కూడా బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. రామ్ కోసం పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేశాడట. స్టార్ కాస్ట్ ను కూడా ఈ యాక్షన్ డైరెక్టర్ ఎంపిక చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో రామ్ కు జోడీగా చాలా మంది హీరోయిన్లను పరిశీలించారు. ఫైనల్ గా పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల ను బోయపాటి ఫిక్స్ చేశాడు. దీనిపై దసరా రోజు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

- Advertisement -

తాజాగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ నేటి నుంచి జరుపుకుంటుంది. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి విడుదల చేయాలని బోయపాటి చూస్తున్నారు. దీని తర్వాత బాలయ్య తో బోయపాటి మరో సినిమా చేయబోతున్నాడు. దీంతో RAPO20 షూటింగ్ త్వరగానే పూర్తి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి RAPO20 వల్ల రామ్ పోతినేని సూపర్ హిట్ కొడుతాడా ? లేక గత రెండు సినిమాల్లాగే పరాజయాన్ని మూటగట్టుకుంటాడా ? అని తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు